కేసీఆర్‌కు సీనియర్ నేత షాకిస్తారా... నిర్ణయం అప్పుడే...

ఈ మధ్య నాయిని నర్సింహారెడ్డి కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. టీఆర్ఎస్‌ తరపున ఆయన వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. దీంతో నాయిని ఆలోచన ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

news18-telugu
Updated: December 6, 2019, 4:53 PM IST
కేసీఆర్‌కు సీనియర్ నేత షాకిస్తారా... నిర్ణయం అప్పుడే...
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
టీఆర్ఎస్‌లో అందరికంటే సీనియర్ నేత ఎవరంటే... ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది నాయిని నర్సింహారెడ్డి. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌లో కలిసి ముందుకు నడిచిన అతికొద్ది మంది నాయకుల్లో నాయిని నర్సింహారెడ్డి ఒకరు. కేసీఆర్ కూడా నాయిని తగిన గుర్తింపు ఇచ్చారు. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా నాయినికి మంత్రి పదవి ఇప్పించిన కేసీఆర్... 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు కీలకమైన హోంశాఖ బాధ్యతలను అప్పగించారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత నాయినికి మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్... ఆయన ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేస్తారా ? అన్నది ఉత్కంఠగా మారింది.

అయితే ఈ మధ్య నాయిని నర్సింహారెడ్డి కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. టీఆర్ఎస్‌ తరపున ఆయన వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. దీంతో నాయిని ఆలోచన ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. తనకు టీఆర్ఎస్ మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తుందా ? లేదా అన్న విషయంలో క్లారిటీ వచ్చిన తరువాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలనే యోచనలో నాయిని ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కంటే ఎక్కువగా... తన అల్లుడైన రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్‌ మీదే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారని తెలుస్తోంది.

Nayini narasimha reddy, cm kcr, mlc, trs, telangana, నాయిని నర్సింహారెడ్డి, సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్, తెలంగాణ
నాయిని నర్సింహరెడ్డి (ఫైల్ ఫోటో)


గత అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే టికెట్‌ను తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి ఇప్పించుకోవాలని చివరివరకు ప్రయత్నించిన నాయిని... కేసీఆర్ బుజ్జగింపుతో వెనక్కి తగ్గారు. అయితే ఆ తరువాత కూడా తనకు పార్టీలో న్యాయం జరగలేదనే భావనలో ఉన్న నాయిని... తన ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ అంశంపై స్పష్టత వచ్చిన తరువాతే రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>