Home /News /politics /

NAGARI MLA RK ROJA FIRE ON NARA LOKESH AND CHANDRA BABU NAIDU IN TIRUMALA NGS TPT

Roja on CM Jagan: జగన్ ఫేక్ కాదు.. ఫేట్ మార్చే సీఎం.. లోకేష్ కు రోజా జబర్దస్త్ పంచ్ లు

లోకేష్ పై రోజా సెటైర్లు

లోకేష్ పై రోజా సెటైర్లు

నగరి ఎమ్మెల్యే దూకుడు మామూలుగా లేదు. ఆ మధ్య కాస్త సైలెంట్ గా కనిపించిన ఆమె.. మళ్లీ తనదైన స్టైల్లో విపక్షాలపై సెటైర్లు వేస్తున్నారు. మంత్రి పదవి పక్కా అనుకున్నారా..? కారణమేదైనా ఆమె ప్రస్తుతం ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు.

  నగరి ఎమ్మెల్యే రోజా మళ్లీ దూకుడు పెంచారు. తనదైన స్టైల్లో ప్రతిపక్షాలపై జబర్దస్త్ పంచ్ లు పేలుస్తున్నారు. పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె కొంతకాలం క్రితం వరకు కాస్త సైలెంట్ గా కనిపించారు. కానీ ఇటీవల ఆమెకు మంత్రి పదవి వస్తుందని ప్రచారమో.. లేక అధినేత చూపు తనపై పడాలి అనుకుంటున్నారో.. విపక్షాలకు ధీటుగా కౌంటర్లు ఇస్తూ దూకుడు పెంచారు. ఎప్పుడూ లేనంత జోష్ లో కనిపిస్తున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న రోజా.. తరువాత చంద్రబాబు., లోకేష్ లపై ధ్వజమెత్తారు. చిత్తశుద్దితో గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైపు సీఎం జగన్ అడుగులు వేస్తుంటే..  పప్పుగా ముద్ర వేసుకున్న లోకేష్ మాట్లాడిన మాటలు చాల బాధిస్తున్నాయన్నారు. ఎవరో ఒకతను ఉద్యోగం కోసం ఎదురు చూసి చనిపోతే.. దానికి జగన్ ను ఫేక్ సీఎం అంటూ నిందలు వేయడం సబబు కాదన్నారు. ఇంటికో ఉద్యోగం అంటూ అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చని చంద్రబాబును ఫేక్ సీఎంగా భావించి ప్రజలు సాగనంపారని గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానని.. మొండిచెయ్యి చూపించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఫేక్ విధానంలో మామకు వెన్నుపోటు పొడిచి సీఎ. అయ్యారని విమర్శించారు. జగన్ ఫేక్ సీఎం కాదు ప్రజల ఫేట్ మార్చేసీఎం అని కొనియాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని గుర్తు చేశారు.  లక్ష 80 వేల పెర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుంది అన్నారు..

  వార్డ్ మెంబెర్ గా గెలవలేని... లోకేష్ ను దొడ్డిదారిలో మంత్రిని చేసి ఒక్క లోకేష్ కు నిరుద్యోగం లేకుండా చంద్రబాబు చేశారని గుర్తు చేశారు. సీఎం జగన్ యూత్ ఐకాన్ గా ముందుకు వెళ్తున్నారన్నా ఆమె...  వైసీపీపై బురదచల్లే ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆ 23  సీట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. ఇక స్వాతంత్రం గురించి మాట్లాడుతూ.. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

  ఎంతో మంది మహానుభావుల త్యాగాల వల్ల వచ్చిన స్వాతంత్రం దినోత్సవం రోజు వారి త్యాగాలు స్మరించుకోవాలని అన్నారు. మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని గర్వంగా చెప్తున్నానన్నారు. పేదల దారిద్యాన్ని దూరం చేసే సంకల్పం సీఎం చేపట్టారని తెలిపారు. ప్రతి ఇంటి సమస్య తెలుసుకుని గ్రామ సంచివాలయం ద్వారా.. పరిష్కరించే దిశగా గ్రామ సచివాలయ వ్యవస్థ పనిచేస్తోందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు చక్కటి చదువు.... అందేలా నాడు నేడు.,అమ్మ ఒడి పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. అందరికీ అవసరమైనది విద్య, వైద్యం అని గుర్తించిన ప్రభుత్వం తమది అన్నారు. అందుకే ఆరోగ్యశ్రీ ని విస్తరింప చేసి.. పేదవాడికి మంచి వైద్యం అందించాలని సంకల్పించారని చెప్పారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Chandrababu naidu, Jabardasth roja, MLA Roja, Nara Lokesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు