NAGABABU REQUEST CM JAGAN TO TAKE BACK DECISION ON AMARAVATI SK
జగన్కు నాగబాబు రిక్వెస్ట్.. ఆ పని చేయకండి ప్లీజ్..
నాగబాబు, వైఎస్ జగన్
రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉందని పేర్కొన్నారు నాగబాబు.
ఏపీలో రాజధాని ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలిచొద్దంటూ రైతుల ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. వారికి మద్దుగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రైతుల కోసం జనసేన అధినేత పవన్ కూడా త్వరలో అమరావతిలో లాంగ్ మార్చ్ చేపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని రైతుల ఆందోళనలపై నాగబాబు స్పందించారు. యూదుల మీద పగబట్టి వాళ్ళ జాతిని నాశనం చేసిన ఆడాల్ఫ్ హిట్లర్ నాశనం అయిపోయాడని.. ప్లీజ్ జగన్ రెడ్డి మీరు ఆ తప్పు చేయకండని విజ్ఞప్తి చేశారు. తప్పును సరిద్దించుకునేందుకు ఇంకా సయముందని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.
రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మీ రూమ్స్ లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతం లో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది. రాజధాని రైతుల పోరాటం నిజంగా ప్రశంసనీయం.ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికి రైతుల పోరాటం స్ఫూర్తి దాయకం.మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.మీ పోరాటం వృధా పోకూడదని కోరుతున్నా.
— నాగబాబు
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అమరావతి రైతుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి నిరసన కవాతు చేపట్టాలని యోచిస్తున్నారు. గతంలో ఇసుక కొరతకు నిరసనగా, భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. అదే తరహాలో ఈసారి అమరావతి రైతుల కోసం విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే, అది ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై పవన్ కళ్యాన్ స్వయంగా తేదీ, సమయం ప్రకటించనున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.