చిరంజీవి ఎఫెక్ట్... షాక్‌లో నాగబాబు... ఎటూ తేల్చుకోలేక...

గత ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు... ఆ తరువాత కూడా నరసాపురం జనసేన కార్యకర్తలతో నిత్యం టచ్‌లో ఉంటూ వస్తున్నారు.

news18-telugu
Updated: December 23, 2019, 4:49 PM IST
చిరంజీవి ఎఫెక్ట్... షాక్‌లో నాగబాబు... ఎటూ తేల్చుకోలేక...
చిరంజీవి.,నాగబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఇటీవలే జబర్ధస్త్‌కు గుడ్ బై చెప్పిన మెగాబ్రదర్ నాగబాబు... మరో టీవీ ఛానల్‌లోని కొత్త కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. టీవీ షోతో పాటు రాజకీయాలకు సైతం ఇకపై ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు నాగబాబు. గత ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు... ఆ తరువాత కూడా నరసాపురం జనసేన కార్యకర్తలతో నిత్యం టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన ఏర్పాటు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్న నాగబాబు... పార్టీలో మరింత యాక్టివ్ అవుతున్నారు.

పవన్ రైతు దీక్షతో పాటు ఇటీవల నాదెండ్ల మనోహర్’తో కలిసి అమరావతి రైతులకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగబాబు పాల్గొన్నారు. ఓ వైపు తమ్ముడితో కలిసి నాగబాబు జనసేనలో యాక్టివ్ అవుతున్న క్రమంలోనే చిరంజీవి సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. దిశ చట్టంతో పాటు జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు చిరంజీవి జై కొట్టడం... జనసేనతో పాటు నాగబాబును కూడా షాక్‌లో పడేసిందని తెలుస్తోంది. తాను జనసేన తరపున రాజకీయాల్లో బిజీ అవుతున్న తరుణంలో చిరంజీవి ఈ రకమైన వైఖరి తీసుకోవడం నాగబాబుకు మింగుడుపడటం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: December 23, 2019, 4:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading