జబర్ధస్త్‌లో జడ్జిగా కొనసాగుతున్న రోజా... అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేగానూ కొనసాగుతూ వచ్చారు. ఇటు ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని... అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చారు. అయితే తాజాగా జబర్ధస్త్ నుంచి నాగబాబు బయటకు వెళ్లిపోవడంతో... ఈ షో భారమంతా రోజాపైనే ఉందనే టాక్ వినిపిస్తోంది. నాగబాబు వెళ్లిపోయినా... జబర్ధస్త్‌లో రోజా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. బజర్ధస్త్ నుంచి బయటకు వెళ్లే విషయంలో ఆమె ఎలాంటి కామెంట్ చేయకపోవడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే జబర్ధస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోవడంతో...రాజకీయంగానూ ఓ విషయంలో రోజాకు లైన్ క్లియర్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది.
జబర్ధస్త్‌లో నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహరించడం వల్లనో లేక ఇతర కారణాల వల్లో తెలియదు కానీ... జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శించే విషయంలో రోజా ఇప్పటివరకు అంత దూకుడుగా వ్యవహరించలేదనే చెప్పాలి. మిగతా నాయకులతో పోలిస్తే... పవన్ కళ్యాణ్‌ను విమర్శించే విషయంలో రోజా కాస్త సంయమనం పాటించారు. ఇందుకు జబర్ధస్త్ షోలో నాగబాబు ఉండటం కూడా ఓ కారణమనే టాక్ వినిపించింది. అయితే తాజాగా జబర్ధస్త్ నుంచి నాగబాబు బయటకు వెళ్లిపోవడంతో... పవన్ కళ్యాణ్‌ను విమర్శించే విషయంలో రోజా మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని పలువురు భావించారు. ఇందుకు తగ్గట్టుగానే రోజా కూడా పవన్ కళ్యాణ్‌ను విమర్శించే విషయంలో మరింత స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీఐఐసీ ఛైర్పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో జనసేన-బీజేపీ పొత్తుపై ఇప్పుడు చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా తప్పుబట్టుతున్నారు. ఇరు పార్టీల పొత్తుపై వామపక్షాలు, వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో నగరి ఎమ్మెల్యే రోజా సైతం పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పవన్‌తో పొత్తంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడమేనని ఎద్దేవా చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ విషయంలో ఒకప్పుడు కాస్త సంయమనంతో విమర్శలు చేసే రోజా... ఇప్పుడు ఆయన విషయంలోనూ అదే ఫైర్ ప్రదర్శిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.