Biden Family in India: భార‌త్‌లో జో బైడెన్‌కు రక్త సంబంధీకులు ఉన్నారా? అవుననే అంటున్న ప్రధాని మోదీ!

దేశంలో పదుల భాషలు, విభిన్న జాతులు, సంస్కృతులు, వేషధారణ ఉన్న భారత్ ఒక ఉపఖండం అని మోదీ అన్నారు. టీ స్టాల్‌లో టీ అమ్ముకునే చిన్నారి ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం తన దేశం కల్పించిందని వెల్లడించారు. మొదట సీఎంగా పనిచేశానని.. ఇప్పుడు ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నానని నరేంద్ర మోదీ తనను తాను పరిచయం చేసుకున్నారు.

భారత దేశంలోని కొందరు వ్యక్తులతో బైడెన్‌కి కుటుంబ అనుబంధాలు ఉన్నాయనే అంశంపై మోదీ చర్చించారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. యూఎస్ సెనేట్‌కు మొదటిసారి ఎన్నికైనప్పుడు ముంబయిలోని ఒక వ్యక్తి నుంచి ‘బైడెన్’ ఇంటిపేరుతో తనకు ఒక లేఖ వచ్చిందని గుర్తుచేసుకున్నారు.

  • Share this:
అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime minister Narendra modi).. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు (America President) జో బైడెన్‌ (joe Biden)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జో బైడెన్, మోదీ.. ఇండో-పసిఫిక్‌ (Indo pacific) ప్రాంతంలోని పరిస్థితులపై చర్చించుకున్నారు. అంతకంటే ముందుగా ఓ ఆసక్తికర అంశం గురించి చర్చించి శ్వేత సౌధం (White House)లోని మీటింగ్ హాల్‌లో ఇద్దరూ నవ్వులు పూయించారు. భారత దేశంలోని కొందరు వ్యక్తులతో బైడెన్‌కి కుటుంబ అనుబంధాలు ఉన్నాయనే అంశంపై మోదీ (modi) చర్చించారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. యూఎస్ సెనేట్‌కు మొదటిసారి ఎన్నికైనప్పుడు ముంబయి (Mumbai) లోని ఒక వ్యక్తి నుంచి ‘బైడెన్’ ఇంటిపేరుతో తనకు ఒక లేఖ (letter) వచ్చిందని గుర్తుచేసుకున్నారు.

బంధువులు ఉన్నట్లు లేఖ వచ్చిందంటూ..

అయితే ఆ తర్వాత వారి గురించి ఆరా తీసే ఛాన్స్ తనకు రాలేదన్నారు. ఇక యూఎస్ ఉపాధ్యక్షుడి (As US vice president)గా భారతదేశానికి వచ్చినప్పుడు కూడా తనకు భారత్‌లో బంధువులు (Relatives), రక్తసంబంధీకులు ఎవరైనా ఉన్నారా? అని స్థానిక మీడియా అడిగినట్లు బైడెన్ (Biden) గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తనకు వచ్చిన లేఖ గురించి వివరించారు. మరుసటి రోజు భారతదేశంలో బైడెన్ అనే ఇంటి పేరు గల ఐదుగురు ఉన్నట్లు ఇండియన్ ప్రెస్ తనకు తెలియజేసినట్లు పేర్కొన్నారు.

ఐరిష్​ మూలాలున్నట్లు..

తనకు భారతీయ బంధువులు (relatives) ఉన్నట్లు ఎప్పుడూ ఒప్పుకోనప్పటికీ.. భారతదేశంలో ఈస్ట్ ఇండియా టీ కంపెనీలో కెప్టెన్‌గా జార్జ్ బైడెన్ (George Biden) కొనసాగినట్లు తాను తెలుసుకున్నానని వెల్లడించారు. అతడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసినట్లు తెలిపారు. శతాబ్దాలుగా వలసదారుల పాలనలో ఇండియా (India) ఉన్నప్పుడు వాణిజ్య శక్తిగా ఈస్ట్ ఇండియా కంపెనీ కొనసాగింది. ఆగ్నేయాసియాలోని వాణిజ్యాన్ని సైతం ఇది నియంత్రించేది. తనకు ఐరిష్ మూలాలున్నట్లు తరచుగా చెప్పుకునే బైడెన్.. బ్రిటిష్ (British) మూలాలు ఉన్నట్లు ఒప్పుకోవడం కష్టమైన విషయమన్నారు.

గతంలో బైడెన్ భారతీయలకు ఒక ఆసక్తికరమైన కథ గురించి చెప్పారు. కెప్టెన్ జార్జ్ బైడెన్ ఒక భారతీయ మహిళ (India women)ను వివాహం (marriage) చేసుకున్నారని తాను తెలుసుకున్నానన్నారు. కానీ అంతకుమించి విషయాలు తెలుసుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. బహుశా ఈ విషయాన్ని తేల్చేందుకే ఇవాళ మోదీ వాషింగ్టన్‌ (Washington)లో ఉన్నారేమోనని ఆయన చమత్కరించారు.

దీంతో మోదీ సమాధానమిస్తూ వాస్తవానికి తాను ఈ విషయం గురించి పరిశీలించానని.. ముంబయితో బైడెన్ కి ఉన్న సంబంధీకులపై స్పష్టత ఇచ్చేందుకు డాక్యుమెంట్ల (documents)ను తీసుకువచ్చానన్నారు. అది వినగానే బైడెన్.. 'నాకు ఇండియన్ బైడెన్లకు మధ్య బంధుత్వం ఉందా?' అని ప్రశ్నించారు. దీనికి.. ‘అవును, వారు మీ బంధువులే’ అని మోదీ (modi) ధ్రువీకరించారు. అయితే ఆ డాక్యుమెంట్లలో ఏముందనే వివరాలు మాత్రం బయటకు తెలియలేదు.
Published by:Prabhakar Vaddi
First published: