నా ఓటు గల్లంతైంది.. బాంబు పేల్చిన ఏపీ మంత్రి

ఎనిమిది సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న తన పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్య జనం పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని మంత్రి ఫరూక్ అన్నారు.

news18-telugu
Updated: March 8, 2019, 5:41 PM IST
నా ఓటు గల్లంతైంది.. బాంబు పేల్చిన ఏపీ మంత్రి
Check Vote: మీ ఓటు ఉందా... లేదా? ఇలా చెక్ చేసుకోండి
  • Share this:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డేటా చోరీ వివాదం సంచలనం సృష్టిస్తున్న వేళ.. మరో బాంబు పేల్చారు ఏపీ మంత్రి ఫరూక్. తన ఓటు కూడా గల్లంతయిందని చెప్పారు. కర్నూలులో జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి.. తన ఓటు కూడా గల్లంతైన విషయాన్ని బయటపెట్టారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఫరూక్ కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. శాసనమండలికి కూడా ఎన్నికయ్యారు. అలాంటి వ్యక్తి ఓటు గల్లంతు కావడం సంచలనంగా మారింది. తన ఓటు గల్లంతైన విషయం అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పిన మంత్రి.. దానికి వారు తమకు తెలియదని సమాచారం ఇచ్చారని చెప్పారు. ఎనిమిది సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న తన పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్య జనం పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. దీనిపై ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశామని చెప్పారు. తన ఓటు గల్లంతు కావడం వెనుక వైసీపీ హస్తం ఉందని మంత్రి ఫరూక్ అనుమానం వ్యక్తం చేశారు.

ఓటర్ల డేటాను చోరీ చేసి వైసీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లను తొలగిస్తోందంటూ జగన్ మోహన్ రెడ్డి పార్టీ అధికార తెలుగుదేశం మీద విమర్శలు గుప్పిస్తోంది. అయితే, ఫామ్ 7 దరఖాస్తు చేసి టీడీపీ వాళ్ల ఓట్లనే వైసీపీ తీయించేస్తోందంటూ చంద్రబాబునాయుడు పార్టీ ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల ఓట్లు కూడా గల్లంతు కావడం విశేషం. సత్తెనపల్లిలోతన ఓటు, తన కుటుంబం ఓటు తీసేశారంటూ నిన్న వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఇప్పుడు తన ఓటు గల్లంతైందని ఏకంగా మంత్రి ఫరూక్ బయటకు వచ్చారు.
First published: March 8, 2019, 5:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading