Home /News /politics /

MY RELATIONSHIP WITH MUSLIMS IS SAME AS THEIR RELATIONSHIP WITH ME YOGI ADITYANATH TELLS NEWS18 MKS

Yogi Adityanath Exclusive: ముస్లింలు నన్నెలా చూస్తారో.. వాళ్లను నేనూ అలానే చూస్తా

నెట్‌వర్క్ 18 ఎడిటర్ -ఇన్-చీఫ్ రాహుల్ జోషికి యూపీ సీఎం యోగి ఇంటర్వ్యూ

నెట్‌వర్క్ 18 ఎడిటర్ -ఇన్-చీఫ్ రాహుల్ జోషికి యూపీ సీఎం యోగి ఇంటర్వ్యూ

‘ముస్లింలతో నా బంధం చాలా సుస్పష్టం. వాళ్లు(ముస్లింలు) నన్నెలా చూస్తారో.. నేను కూడా వాళ్లతో అదే రీతిగా వ్యవహరిస్తాను’అని యోగి వ్యాఖ్యానించారు. గోరఖ్‌పూర్ లో నామినేషన్ తర్వాత యోగి తన మొట్టమొదటి ఇంటర్వ్యూను నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చారు.

ఇంకా చదవండి ...
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్నకొద్దీ వాతావరణం మరింత వేడెక్కుతూ ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నాడు తన సొంతగడ్డ గోరఖ్‌పూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటరాగా, యోగి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ తర్వాత యోగి తన మొట్టమొదటి ఇంటర్వ్యూను నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో యూపీ సీఎం యోగి పలు కీలక అంశాలపై కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడారు.

యూపీలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో రాష్ట్రీయ జనతాదళ్ జయంత్ చౌదరి పొత్తు, ప్రస్తుత బీజేపీ నుంచి ఓబీసీ నేతల పలాయనం, వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం లాంటి ప్రభావాలేవీ ఎన్నికలపై ఉండదన్న సీఎం యోగి.. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ 300 పైచిలుకు సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో ముస్లింలను ఉద్దేశించి, ఆ సముదాయంతో తన సంబంధాలపైనా యోగి స్పష్టత ఇచ్చారు.

Statue of Equality: 216 అడుగుల సమతా మూర్తిని జాతికి అంకితం చేసిన PM Modi
గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన ఇంటర్వ్యూలో, యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ముస్లిం నేత, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై దాడిని ఖండించారు. అయితే ఎన్నికల ప్రసంగాలలో ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా నాయకులు జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా ఒవైసీకి యోగి చురకవేశారు. ‘ముస్లింలతో నా బంధం చాలా సుస్పష్టం. వాళ్లు(ముస్లింలు) నన్నెలా చూస్తారో.. నేను కూడా వాళ్లతో అదే రీతిగా వ్యవహరిస్తాను’అని యోగి వ్యాఖ్యానించారు. దేశ భద్రత కంటే ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నారంటూ ఇటీవలి రాహుల్ గాంధీ ప్రసంగంపై యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Asaduddin Owaisi wife: ఏంటి? కొత్త కథ చెబుతున్నారా? -కాల్పుల ఘటనను నమ్మని ఒవైసీ భార్య!గోరఖ్‌పూర్‌ సహా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి తనకు తెలియనది కాదని, ఎక్కణ్నుంచి పోటీ చేయాలనే విషయంలో పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్న యోగి.. గోరఖ్‌పూర్ నుంచి అవకాశం కల్పించిన మోదీ, షా, బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్ విస్తృతమైన పరివర్తనకు సాక్ష్యంగా నిలిచిందని, రాష్ట్రంలో పెట్టుబడి పరిధి పెరుగుతోంది, పారదర్శకంగా ఉపాధి కల్పన మెరుగైందని యోగి తెలిపారు.

Marital Rape: ప్రతి పురుషుడూ రేపిస్ట్ కాదు: కేంద్ర మంత్రి Smriti Irani క్లారిటీనీటిపారుదల, పంటలకు మద్దతు ధర, రుణమాఫీ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలతో రైతుల సంక్షేమం కోసం బీజేపీ సర్కారు పనిచేసిందని, యూపీలో ఇప్పుడు మహిళలు సురక్షితంగా ఉన్నారని, మహిళల్ని ఆర్థికంగా స్వతంత్రులుగా మర్చే ప్రయత్నం విజయవంతంగా సాగుతోందని సీఎం యోగి చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల యూపీ లాభపడిందని, ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 300 ప్లస్ సీట్లు వస్తాయని యోగి ధీమా వ్యక్తం చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Network18, Uttar Pradesh Assembly Elections, Yogi adityanath

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు