తన భర్త కనిపించడం లేదంటున్న... మాజీ మంత్రి అఖిలప్రియ

తనతో టచ్‌లో కూడా లేరని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: October 15, 2019, 12:54 PM IST
తన భర్త కనిపించడం లేదంటున్న... మాజీ మంత్రి అఖిలప్రియ
భూమా అఖిలప్రియ (file)
  • Share this:
టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త కనిపించడం లేదంటూ ఆమె పోలీసులకు తెలిపారు. కేసులు నమోదైన తర్వాత నుంచి తన భర్త భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారో తనకు తెలియదన్నారు. తనతో టచ్‌లో కూడా లేరని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. పారిపోవాల్సిన అవసరం భార్గవరామ్‌కు లేదన్నారు.తమపై, తన భర్తపై వైసీపీ నేతలు కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు అఖిలప్రియ.

కావాలనే తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాము పులివెందుల వెళ్లినందుకే ఇలా కేసులు పెడుతున్నారని అఖిలప్రియ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.భార్గవ్‌రామ్‌పై నమోదైనవి తప్పుడు కేసులేనన్న విషయం పోలీసులకు కూడా తెలుసన్నారు. క్రషర్‌లో ఆయనకూ భాగం ఉందని, ఆయన ఎవరిపైనా దాడి చేయలేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. నిజానికి క్రషర్ వివాదం సివిల్ విషయమని, కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యేదని అన్నారు.


First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు