• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • MY FIGHT AGAINST PM MODI WONT SAY A WORD AGAINST CPM RAHUL GANDHI IN WAYANAD SB

సీపీఎంను నేనేం అనను... బీజీపీయే నా టార్గెట్ : రాహుల్ గాంధీ

సీపీఎంను నేనేం అనను... బీజీపీయే నా టార్గెట్ : రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ (File)

.సీపీఎంలోని సోదర, సోదరీమణులు ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారని, నాపై మాటల దాడికి దిగుతారని తెలుసు. కానీ నేను మాత్రం నా ప్రచారంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడనన్నారు రాహుల్ గాంధీ.

 • Share this:
  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం తన రెండో లోక్‌సభ సీటు వయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్... తన ప్రచారంలో కేరళలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా అనను అన్నారాయన .సీపీఎంలోని సోదర, సోదరీమణులు ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారని, నాపై మాటల దాడికి దిగుతారని తెలుసు. కానీ నేను మాత్రం నా ప్రచారంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడను. ఇండియా అంతా ఒక్కటే అన్న సందేశాన్ని ఇవ్వడానికే నేను కేరళ నుంచి పోటీ చేస్తున్నాను అని రాహుల్ స్పష్టం చేశారు. కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపైనే తన పోరాటమన్నారు.

  గురువారం తన చెల్లి ప్రియాంకాతో కలిసి వచ్చిన రాహుల్ వయనాడ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే రాహుల్ కేరళ నుంచి పోటీ చేయడంపై అక్కడి అధికార పార్టీ సీపీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పిన రాహుల్.. ఇప్పుడు కేరళలో లెఫ్ట్ పార్టీలపై పోటీ చేయడమేంటని సీపీఎం ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలపై తాజగా నామినేషన్ వేసిన సందర్భంగా రాహుల్ మరోసారి స్పందించారు.

  First published: