నా కుటుంబం రాజకీయాల్లోకి రాదు: వెంకయ్య నాయుడు

ఇక నుంచి ఐదు అంశాలతో ప్రజల్లోకి వెళ్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పర్యటించి యువకుల్లో స్ఫూర్తి నింపుతానని తెలిపారు వెంకయ్య నాయుడు.

news18-telugu
Updated: February 23, 2019, 4:27 PM IST
నా కుటుంబం రాజకీయాల్లోకి రాదు: వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య సంచలనాత్మక విషయాలపై మాట్లాడారు. తన కుటుంబం నుంచి ఎవరూ కూడా రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు. జిల్లాలో నాలుగోరోజు పర్యటిస్తున్న ఆయన వెంకటాచలంలో మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో వారసులు రావడం చాలా సర్వ ాధారణమైయింది. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పొలిటీషియన్స్ తమ తర్వాత పిల్లల్ని కూడా రాజకీయ కథనరంగంలోకి దింపుతున్నారు. మరి అలాంటి పరిస్థితులెవరూ తన కుటుంబం నుంచి రాజకీయాల్లో ఎవరూ రారని వెంకయ్య నాయుడు క్లారిటీ ఇచ్చేయడంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఇక నుంచి ఐదు అంశాలతో ప్రజల్లోకి వెళ్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పర్యటించి యువకుల్లో స్ఫూర్తి నింపుతానని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు పరిశీలిస్తానని చెప్పారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతుల వద్దకు వెళ్తానని, భారత దేశ సంస్కృతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని వెల్లడించారు.

1973-74లో ఆంధ్ర విశ్వవిద్యాలయపు విద్యార్థినాయకుడిగా ఉన్నప్పుడే వెంకయ్య నాయుడులో రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి. 1977 నుంచి 1980 వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అదే సమయంలో 1978లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1971, ఏప్రిల్ 14న వెంకయ్య నాయుడు వివాహం చేసుకున్నారు. భార్య పేరు ఉష.వీరికి ఇద్దరు పిల్లలు. ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కానీ వాళ్లను ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంచారు. కుమార్తె దీపా వెంకట్ స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఆమె నెల్లూరు లోని అక్షర విద్యాలయకు కరెస్పాండెంట్ గా కూడా ఉన్నారు.
First published: February 23, 2019, 4:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading