Home /News /politics /

MY ASSUMENTIONS ARE ALMOST CORRECT IN TELANGANA SAYS LAGADAPATI RAJAGOPAL BA

తెలంగాణలో నా లెక్క తప్పలేదు.. లగడపాటి కొత్త లెక్క

లగడపాటి రాజగోపాల్, కేేటీఆర్

లగడపాటి రాజగోపాల్, కేేటీఆర్

‘తెలంగాణలో పది మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పా. అయితే, అందులో ఇద్దరు గెలిచారు. మిగిలిన ఎనిమిది మంది రెండో స్థానంలో వచ్చారు. ప్రజల నాడి పట్టుకోకపోతే ఆ విషయం తెలిసేది కాదు.’ అని లగడపాటి అన్నారు.

    తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చెప్పిన జోస్యం విఫలమైంది. తెలంగాణలో మహాకూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పారు. కానీ, టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. అలాగే, తెలంగాణ ఎన్నికల్లో పది మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు విజయం సాధిస్తారని లగడపాటి జోస్యం చెప్పారు. అయితే, అది కూడా ఫెయిల్ అయింది. విజయవాడలో లగడపాటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘తెలంగాణలో పది మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పా. అయితే, అందులో ఇద్దరు గెలిచారు. మిగిలిన ఎనిమిది మంది రెండో స్థానంలో వచ్చారు. ప్రజల నాడి పట్టుకోకపోతే ఆ విషయం తెలిసేది కాదు.’ అని లగడపాటి అన్నారు.

    తెలంగాణలో తన లెక్క ఎందుకు తప్పింది? తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై ఈనెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో వెల్లడిస్తానని చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Lagadapati, Lok Sabha Election 2019, Telangana Lok Sabha Elections 2019

    తదుపరి వార్తలు