• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MUSLIMS OF PAK AFGHAN BANGLADESH CAN GO TO ISLAMIC COUNTRIES SAYS NITIN GADKARI MS

ఆ ముస్లింలకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి.. సీఏఏపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ఆ ముస్లింలకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి.. సీఏఏపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

నితిన్ గడ్కరీ(ఫైల్ ఫోటో)

పాకిస్తాన్‌లో వివక్షను ఎదుర్కొంటూ హింసను అనుభవిస్తున్న హిందువులు,ఇతర మైనారిటీలు వెళ్లడానికి భారత్ తప్ప వారికి ఇంకో ఆప్షన్ లేదన్నారు. ఆ దేశాల్లో వారి పట్ల దారుణమైన అత్యాచారాలు,హత్యలు,దోపిడీ కొనసాగాయన్నారు.

  • Share this:
    జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్‌ఆర్‌సీ),పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉధృతమవుతున్న వేళ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి అక్రమంగా వలసొచ్చిన ముస్లింలకు తిరిగి వెళ్లిపోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 ఇస్లామిక్ దేశాలున్నాయని.. వాటిల్లో ఏ దేశానికైనా వారు వెళ్లవచ్చునని అన్నారు. అదే సమయంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో వివక్షకు గురవుతున్న మైనారిటీలకు ఇండియా తప్ప మరో ఆప్షన్ లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి మద్దతునిస్తూ మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన సభలో నితిన్ గడ్కరీ మాట్లాడారు.

    ఆ మూడు దేశాల నుంచి వలసొచ్చే ముస్లింలను శరణార్థులుగా పరిగణించలేం. ఆ దేశాల నుంచి వలసొచ్చే
    హిందు,జైన,పార్సి,సిక్కు,క్రిస్టియన్ మతస్తులను మాత్రమే శరణార్థులుగా పరిగణించగలం. ఒకవేళ ఆ మూడు దేశాలకు
    చెందిన ముస్లింలు వారి దేశాన్ని వదిలి వెళ్లాలనుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100-150 ఇస్లామిక్ దేశాల్లో ఎక్కడికైనా వెళ్లవచ్చు.కానీ ఆ దేశాల నుంచి వలసొచ్చే హిందు,సిక్కు,జైన,పార్సి,సిక్కు మతస్తులకు ఇండియా తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు.
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ


    పాకిస్తాన్‌లో వివక్షను ఎదుర్కొంటూ హింసను అనుభవిస్తున్న హిందువులు,ఇతర మైనారిటీలు వెళ్లడానికి భారత్ తప్ప వారికి ఇంకో ఆప్షన్ లేదన్నారు. ఆ దేశాల్లో వారి పట్ల దారుణమైన అత్యాచారాలు,హత్యలు,దోపిడీ కొనసాగాయన్నారు. బలవంతపు మత మార్పిడులు కూడా జరిగాయన్నారు.అలాంటివారికి భారత పౌరసత్వం కల్పించకపోతే ఎక్కడికి పోగలరని ప్రశ్నించారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    అగ్ర కథనాలు