Citizenship Amendment Act: సీఏఏపై ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టించారు.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act)పై జరుగుతున్న ఘర్షణలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ వల్ల ముస్లింల జనాభా తగ్గుతుందనే ఆలోచనతో వారిని తప్పుదోవ పట్టించారని చెప్పారు.


Updated: October 25, 2020, 1:28 PM IST
Citizenship Amendment Act: సీఏఏపై ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టించారు.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
మోహన్ భగవత్(ఫైల్ ఫొటో)
  • Share this:
పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act)పై జరుగుతున్న ఘర్షణలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ వల్ల ముస్లింల జనాభా తగ్గుతుందనే ఆలోచనతో వారిని తప్పుదోవ పట్టించారని చెప్పారు. సున్నితమైన అంశాన్ని ఆసరాగా తీసుకుని అవకాశవాదులు దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్రిక్త వాతావరణాన్ని ఏర్పడిందని ఆయన విమర్శించారు. నిరసన పేరిట వ్యవస్థీకృత హింసను ప్రేరేపించడం ద్వారా.. సామాజిక అశాంతి చోటుచేసుకుంటుందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సి ఉందని.. కానీ కరోనావైరస్ విజృంభణతో ఆ ప్రయత్నాలు నిలిచిపోయాయని చెప్పారు.

విజయదశమి సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. "సీఏఏ అనేది ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదు. కానీ ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని చూస్తున్నవారు ముస్లిం జానాభాను తక్కువ చేయడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ముస్లిం సోదరులను తప్పుదారి పట్టించారు. అల్లరి మూకలు, అవకాశవాదులు.. ఈ ఘర్షణలను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో అందరి దృష్టి అటు మళ్లడంతో.. వారి ప్రయత్నాలకు తగిన ప్రచారం కలగలేదు. భారత సరిహద్దు దేశాల్లో వివక్షను ఎదుర్కొంటున్న మతాల వారికి పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేయడానికి పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చారు.. రాజ్యంగ ప్రక్రియ ప్రకారం ఈ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించారు. ఆ దేశాలు అక్కడి మైనార్టీ వర్గాలను హింసకు గురిచేస్తున్న చరిత్రను కలిగి ఉన్నాయి. పౌరసత్వ చట్టానికి ఈ సవరణ.. ఏ ఒక్క ప్రత్యే మతానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. దేశానికి వచ్చే విదేశీయులకు పౌరసత్వం ఇవ్వడానికి రాజ్యంగ నిబంధనలు అలానే కొనసాగుతాయి"అని అన్నారు.

ఇక, హిందుత్వం గురించి కూడా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. అధిపత్యం పేరిట తప్పుడు ప్రచారాలను చేసే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. సుముహంలో విబేధాలు సృష్టించడానికి ఈ పదాన్ని తరుచూ వాడుతున్నారని.. ఘర్షణలు సృష్టించే వారికి ఇది లక్ష్యంగా మారిందని మండిపడ్డారు.
Published by: Sumanth Kanukula
First published: October 25, 2020, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading