MUSIC TO BE HEARD ON THE HORN AND UNION MINISTER GADKARI SAID ARRANGEMENTS WERE BEING MADE TO TIGHTEN THE VEHICLES DURING THE MANUFACTURING PROCESS PRV
వాహనాల హారన్ల శబ్దానికి సంబంధించి కొత్త నిబంధనలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇకపై హారన్ సౌండ్‌లో వినిపించేది సంగీత (music) వాయిద్యం ధ్వని (sound) మాత్రమే. ఈ ప్రణాళికను ఇకపై హారన్‌లో వినియోగించేలా చర్యలకు రంగం సిద్దం చేస్తోందట.
హైదరాబాద్.. ఢిల్లీ.. ముంబై ఇలా ఎక్కడ చూసినా విపరీతమైన ట్రాఫిక్ (Traffic) ఉంటుంది. అంతే అదే దారిలో తెగ హారన్ కొట్టేస్తారు వాహనదారులు. ఫలితంగా విపరీతమైన ధ్వని కాలుష్యం (sound pollution). రోడ్డు మీద ఉన్నవారికే కాకుండా చుట్టు పక్కల ఇళ్లల్లో ఉండే వారికి కూడా ఈ సౌండ్ పొల్యూషన్ చికాకు తెప్పిస్తుంది. హారన్ కొట్టిన కారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గొడవలైన సందర్బాలూ ఉన్నాయి. అయితే ఈ ధ్వని (sound) కాలుష్యానికే కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టే యోచనలో ఉంది. రోడ్లపై వాహనాల హారన్‌తో మీరు కూడా ఇబ్బంది పడుతుంటే.. మీకు ఆశాజనకమైన గుడ్‌న్యూస్‌ను చెప్పబోతోంది కేంద్రం. వాహనాల హారన్ల శబ్దానికి సంబంధించి కొత్త నిబంధనలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇకపై హారన్ సౌండ్‌లో వినిపించేది సంగీత (music) వాయిద్యం ధ్వని (sound) మాత్రమే. ఈ ప్రణాళికను ఇకపై హారన్‌లో వినియోగించేలా చర్యలకు రంగం సిద్దం చేస్తోందట.
నితిన్ గడ్కరీ చొరవతో..
ప్రజా రంజకమైన కార్యక్రమాలను తీసుకొచ్చేందుకు ముందుంటారు కేంద్ర రోడ్డు , రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union minister nitin Gadkari). ఇప్పుడు తాజాగా హార్న్ వాయిస్ చికాకు పెట్టకుండా ఆహ్లాదకరంగా ఉండేలా కొత్త నియమాలను తీసుకొచ్చేందుకు ప్లాన్ (plan) చేస్తున్నారు ఆయన. నాసిక్ (Nasik)లో జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్వని కాలుష్యం (sound pollution) గురించి మాట్లాడుతూ హారన్లను మార్చబోతున్నట్లు వెల్లడించారు. అంబులెన్సు హారన్ (ambulance horn) కూడా వినడానికి అంతగా బాగోదని ఆయన అన్నారు. ఉదయం ఆకాశవాణి (All India radio)లో వచ్చే సంగీత వాయిద్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. అలాంటి ధ్వని హారన్‌లో ఉంటే బాగుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
త్వరలో మీరు వాహనాల హార్న్ శబ్దం నుంచి బయటపడతారని ఆయన వెల్లడించారు. వాహనాల హారన్ల బాధాకరమైన శబ్దం గురించి.. కేంద్ర మంత్రి తన మంత్రిత్వ శాఖ అధికారులు కార్ హారన్ల శబ్దాన్ని మార్చే పనిలో ఉన్నట్లుగా చెప్పారు. తబలా (tambala), తాల్, వయోలిన్ (violin), బుగ్లే, ఫ్లూట్ (flute) వంటి వాయిద్యాల శబ్దం హారన్ నుంచి వినిపించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
గతంలో నితిన్ గడ్కరీ తన అనుభవాన్ని వివరిస్తూ.. తాను నాగపూర్‌లోని 11 వ అంతస్తులో నివసిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయం ఓ గంట పాటు ప్రాణాయామం చేస్తానని అన్నారు. ఈ సమయంలో రోడ్డుపై వాహనాల హారన్ల శబ్ధాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని వెల్లడించారు. ఈ సమస్యకు అడ్డకట్ట వేసేందుకు తన మనసులో ఓ ఆలోచన ఉన్నట్లుగా చెప్పారు. “కార్ హారన్ శబ్దం ఇండియన్ మ్యూజిక్‌లా ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చినట్లుగా వెల్లడించారు. ఇలా మార్చే పనిలో ఉన్నామని” అని గతంలో ఆయన చెప్పారు.
భారీ వాహనాలకు భారీ శబ్ధం వచ్చేలా ప్లాన్ అనుమతి ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. వాహనం తయారవుతున్నప్పుడు రికి సరైన రకం హార్న్ ఉంటుంది. కొత్త నిబంధనల అమలు తర్వాత వాహనాల హారన్లకు బదులుగా తబలా, లయ, వయోలిన్, బుగ్లే, వేణు మొదలైన ట్యూన్లు వినవచ్చు
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.