'ఆ లెటర్ నేను రాయలేదు'...ఈసీకి మురళీ మనోహర్ జోషి ఫిర్యాదు

75 ఏళ్ల వయసు నిండిందనే కారణంతో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు కూడా టికెట్ నిరాకరించింది బీజేపీ హైకమాండ్. పార్టీ నిబంధలను కారణంగానే వారికి టికెట్‌లు ఇవ్వడం సాధ్యం కాలేదని పలు సందర్భాల్లో అమిత్ షా స్పష్టంచేశారు.

news18-telugu
Updated: April 15, 2019, 7:04 PM IST
'ఆ లెటర్ నేను రాయలేదు'...ఈసీకి మురళీ మనోహర్ జోషి ఫిర్యాదు
మురళీ మనోహర్ జోషి
  • Share this:
ఇటీవల బీజేపీ కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషి పేరిట ఓ లేఖ తీవ్ర దుమారం రేపింది. బీజేపీకి ఈసారి 120 సీట్లు కూడా రావని దాని సారాంశం.తొలి విడత ఎన్నికల్లో 10-12 సీట్లు మాత్రమే వస్తాయని అందులో ఉంది. ఈ లేఖను ఎల్‌కే అద్వానీకి ఎంఎం జోషి రాశారని ప్రచారం జరిగింది. దాంతో ఎన్నికలవేళ ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఐతే ఈ లేఖపై స్వయంగా మురళీ మనోహర్ జోషి క్లారిటీ ఇచ్చారు. దానితో తనకు సంబంధం లేదని.. ఎవరో తప్పుడు లేఖను సృష్టించారని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

కాగా, 75 ఏళ్ల వయసు నిండిందనే కారణంతో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు కూడా టికెట్ నిరాకరించింది బీజేపీ హైకమాండ్. పార్టీ నిబంధలను కారణంగానే వారికి టికెట్‌లు ఇవ్వడం సాధ్యం కాలేదని పలు సందర్భాల్లో అమిత్ షా స్పష్టంచేశారు. ఈ క్రమంలో బీజేపీకి 120కి మించి సీట్లరావన్న ఎంఎం జోషి చెప్పినట్లు ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం సంచలనం రేపింది. ఎట్టకేలకు స్వయంగా ఆయనే స్పందించి...ఆ లేఖతో తనకే సంబంధం లేదని కొట్టిపారేయడంతో బీజేపీ కేడర్ ఊపిరిపీల్చుకుంది. తప్పుడు లేఖను సృష్టించిన వారిపై ఈసీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు