• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MUNICIPAL ELECTIONS UPDATE AFTER 14 YEARS GRATER VISKHA ELECTIONS NGS

Municipal elections: 14 ఏళ్ల తరువాత గ్రేటర్ విశాఖ ఎన్నికలు..? ఆలస్యానికి బాధ్యులెవరు? అసలేం జరిగింది?

Municipal elections: 14 ఏళ్ల తరువాత గ్రేటర్ విశాఖ ఎన్నికలు..? ఆలస్యానికి బాధ్యులెవరు? అసలేం జరిగింది?

2007 ఫిబ్రవరి 19న జీవీఎంసీకి ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు.. 2021 మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక జరగడానికి ఆటంకాలన్నీ అధిగమించి 14 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.

2007 ఫిబ్రవరి 19న జీవీఎంసీకి ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు.. 2021 మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక జరగడానికి ఆటంకాలన్నీ అధిగమించి 14 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.

  • Share this:
    పంచాయతీ ఎన్నికల వేడి పూర్తిగా తగ్గకముందే.. మరో సమరానికి సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్. ఈ నెల 10 నుంచి మున్నిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పడింది. ఈ సారి ఇక్కడ ఎన్నికలు చాలా ప్రత్యేకం కానున్నాయి. ఎందుకంటే 14 ఏళ్ల తరువాత గ్రేటర్ విశాఖకు ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి తోడు త్వరలో విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఎగసిపడుతోంది. ఈ అంశాలే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఎన్ని చాలా కీలకంగా మారింది.

    విశాఖలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. గత కొంతకాలం నుంచి జీవీఎంసీ ఎన్నికలు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య వాయిదాలు పడుతూ వచ్చాయి. 2012 ఫిబ్రవరిలో పాలకవర్గం పదవీకాలం పూర్తయినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. నగరంలో పలు పంచాయతీల్ని విలీనం చేసే విషయం, తరువాత ఏర్పడిన పర్యవసానాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి.

    మొదట 2014లో రాష్ట్రంలోని ఇతర పురపాలికలతో కలిపి జీవీఎంసీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అప్పట్లోనే భీమిలి మున్సిపాలిటీతో పాటు ఆ మండలంలోని ఐదు పంచాయతీలు, అనకాపల్లి మున్సిపాలిటీతో పాటు ఆ మండలంలోని మరో ఐదు పంచాయతీలు జీవీఎంసీలో కలుపుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతోనే అసలు సమస్య మొదలైంది. దేశంలోనే తొలి మున్సిపాలిటీగా భీమిలికి గుర్తింపు ఉంది. అందుకే ఈ విలీనంతో ఆ గుర్తింపు పోతుందని, అక్కడి పట్టన ప్రజలతో, గ్రామస్థులతో సంప్రదించకుండా జీవీఎంసీలో కలపడాన్ని స్థానికులు అప్పట్లో ఒప్పుకోలేదు. కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 2014లో జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడ్డాయి.

    అఆ తరువాత నాలుగేళ్ల పాటూ ఈ కేసు కోర్టులో నడిచింది. మధ్యలో ప్రభుత్వాలు మారిపోయాయి. గ్రామాల విలీనంలో రాజకీయ తంతు కూడా నడిచింది. కొందరు మద్దతివ్వడం, మరికొందరు వ్యతిరేకించడం జరుగుతూ వచ్చాయి. అయితే 2018లో మరోసారి సాగిన చర్చలు సక్సెస్ అయ్యాయి. విలీన గ్రామాల ప్రజలతో చర్చలు జరిపి జీవీఎంసీలో విలీనానికి అనుకూలంగా తీర్మానాలు చేయించి పంచాయతీరాజ్‌శాఖకు అనుమతికోసం పంపారు. ఆ తర్వాత ఆమోదం లభించింది.

    విలీన గ్రామస్థులు అనుకూలంగా ఉండటంతో మరోసారి నగరంలో వార్డుల పునర్విభజనకు 2018లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 72 వార్డుల్ని 85వార్డులుగా మారుస్తూ జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపగా ఆమోదించింది. దీని ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని సిద్ధమయ్యారు కూడా. కానీ అప్పుడు నోటిఫికేషన్‌ రాలేదు. తరువాత 2018లో చేసిన పునర్విభజనను రద్దు చేస్తూ 2019లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలీన ప్రతిపాదనలో ఉన్న2 మున్సిపాలిటీలు, 10 పంచాయతీలతో పాటు భీమిలిలోని మరో పంచాయతీని కూడా కలిపి పునర్విభజన ప్రక్రియ మొదలుపెట్టింది. దీంతో 98 వార్డులతో మరో జాబితా ప్రభుత్వానికి పంపగా ఆమోదం లభించింది.

    ఇలా వాయిదాలు పడుతూ వచ్చిన ఎన్నికలకు 2020లో ప్రభుత్వం ఆమోదించిన 98 వార్డులకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ మరోసారి నోటిఫికేషన్‌ జారీచేసింది. అయితే కరోనా మహమ్మారి విస్తరణ కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇలా పలు అవంతరాలు కారణంగా 14 ఏళ్ల తర్వాత ఎన్నికలు మళ్లీ జరుగుతున్నాయి. 2007 ఫిబ్రవరి 19న జీవీఎంసీకి ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు.. 2021 మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక జరగడానికి ఆటంకాలన్నీ అధిగమించి 14 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.  ఈ 14  ఏళ్లు పాటు ప్రత్యేక అధికారుల పాలనలో కార్యక్రమాలు అన్నీ కొనసాగాయి.
    Published by:Nagesh Paina
    First published: