సిరిసిల్లకు రైలు.. మేనిఫెస్టోలో మంత్రి కేటీఆర్ హామీ

సిరిసిల్లను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని.. రానున్న రోజుల్లో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్.


Updated: January 15, 2020, 7:30 PM IST
సిరిసిల్లకు రైలు.. మేనిఫెస్టోలో మంత్రి కేటీఆర్ హామీ
కేటీఆర్
  • Share this:
మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ పట్టణాలపై హామీల వర్షం కురుస్తోంది. హామీలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో సిరిసిల్ల మున్సిపాలిటీ ఎన్నికల మేనిఫెస్టోను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సిరిసిల్లలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలోనే చేసి చూపించామన్నారు. హామీ ఇచ్చినవే కాకుండా.. చెప్పని పనులు కూడా చేశామని చెప్పారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్ఎస్‌కు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతకాదు రాబోయే రెండు మూడేళ్లలో సిరిసిల్లకు రైలు వచ్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

సిరిసిల్లను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని.. రానున్న రోజుల్లో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి నేతలంతా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కొందరు నేతలు టీఆర్ఎస్ పేరుతో మభ్య పెడుతున్నారని..అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్. కాగా, కరీంనగర్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 9 కార్పొరేషన్లలోని 325 కార్పొరేటర్, 120 మున్సిపాలిటీల్లోని 2,727 కౌన్సిలర్ స్థానాలకు జనవరి 22న పోలింగ్ జరగనుంది. జనవరి 25న ఫలితాలను ప్రకటిస్తారు. ఒక్క కరీంనగర్‌ కార్పొరేషన్ పరిధిలో మాత్రం 24న పోలింగ్ జరుగుతుంది. 27న ఫలితాలను వెల్లడిస్తారు.

First published: January 15, 2020, 7:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading