Home /News /politics /

MUNICIPAL CORPORATION MAYORS PAYING HIGH SALARIES IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

AP Municipal Elections: ఏపీలో మేయర్లు, కౌన్సిలర్ల జీతాలు ఎలా ఉంటాయో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకంగా జీతభత్యాలుండవు. ప్రభుత్వ జీవో ప్రకారం గ్రేడ్-1 కార్పొరేషన్ కు ఒక విధంగా, గ్రేడ్-2 కార్పొరేషన్లకు మరో విధంగా ఉంటాయి.

    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల హడావిడి నడుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడం అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏకగ్రీవాలైన ప్రాంతాల్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ప్రచారపర్వం జోరుగా సాగుతోంది. మేయర్లుగా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షిచిందుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఆ వ్యక్తి అసలు చర్చలోకే రారు. అదే గెలిస్తే ఐదేళ్ల పాటు వారిదే పెత్తనం. స్థానికంగా వారు ఎంత చెప్తే అంత. దీంతో ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసేందుకు అభ్యర్థులు వెనుకాడటం లేదు. ఓట్ల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఖర్చు పెట్టేస్తున్నారు. అంతాబాగానే ఉన్నా గెలిచిన వారికి వచ్చే లాభమేంటి.. స్థానికంగా పెత్తనమేనా.. లేక జీతభత్యాలేమైనా ఉంటాయా.. ప్రస్తుత ఇదే హాట్ టాపిక్ గా మారింది.

    మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లకు గౌరవ వేతనం ఉంటుంది. ఐదేళ్ల పాటు నెలనెల వారికి గౌరవేతనం చెల్లిస్తారు. ఈ వేతనం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆర్ధిక స్థితి, రాబడిని బట్టి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారి జీతభత్యాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఐతే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకంగా జీతభత్యాలుండవు. ప్రభుత్వ జీవో ప్రకారం గ్రేడ్-1 కార్పొరేషన్ కు ఒక విధంగా, గ్రేడ్-2 కార్పొరేషన్లకు మరో విధంగా ఉంటాయి. అలాగే జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీలకు ఒకలా.. జిల్లా కేంద్రం కాని మున్సిపాలిటీలకు మరోలా జీతభత్యాలను నిర్ణయించారు.

    ఇది చదవండి: భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ...! ఆర్జిత సేవలకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..



    రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేడ్-1లో ఉన్నాయి. ఈ నగరాల్లో మేయర్లు, కార్పొరేటర్ల జీతాలు ఇతర నగరాలతో పోలిస్తే అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ మూడు నగరాల్లో మేయర్ కు నెలకు రూ.30వేలు, డిప్యూటీ మేయర్ కు రూ.20 వేలు, కార్పొరేటర్ కు రూ.6వేలు జీతంగా నిర్ణయించారు. ఈ జీతాలను రాష్ట్ర ప్రభుత్వం అవసరాన్ని బట్టి పెంచుతుంటుంది.

    ఉదాహరణకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు తీసుకుంటే.. 1981లో కార్పొరేటర్ కు రూ 250, మేయర్ కు రూ.వెయ్యి, డిప్యూటీ మేయర్ కు రూ.750 గౌరవ వేతనంగా ఇచ్చేవారు. 1987లో కార్పొరేటర్ కు రూ.500, మేయర్ కు రూ.2500, డిప్యూటీ మేయర్ కు రూ.1500 లభించేది. 1993లో కార్పొరేటర్ క రూ.1000, మేయర్ కు రూ.3500, డిప్యూటీ మేయర్ కు రూ.2000 ఇచ్చేవారు. 2002లో కార్పొరేటర్ కు రూ.2000, మేయర్ కు రూ.7000, డిప్యూటీ మేయర్ కు రూ.4000 చెల్లించేవారు. 2008లో కార్పొరేటర్ కు రూ.4000, మేయర్ కు రూ.14000, డిప్యూటీ మేయర్ కు రూ.8000 చొప్పున చెల్లించేవారు. 2018లో చేసిన సవరణ ప్రకారం కార్పొరేటర్ కు రూ.6000, మేయర్ కు రూ.30,000, డిప్యటీ మేయర్ కు రూ.20,000 గౌరవ వేతనంగా లభిస్తోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Tirupati, Vijayawada, Visakhapatnam

    తదుపరి వార్తలు