ఫిరాయింపు ఎమ్మెల్యేల కంటే.. రెడ్ లైట్ ఏరియావాళ్లు నయం : సీపీఐ నారాయణ

టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే నిధులు ఇస్తామని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వమని కేసీఆర్ చెబుతున్నారని ఆరోపించారు. అభివృద్ది కోసం టీఆర్ఎస్‌లో చేరడం తప్ప మరో మార్గం లేకపోతే ఇక ఎన్నికలు నిర్వహించడం దేనికి అని ప్రశ్నించారు.

news18-telugu
Updated: June 17, 2019, 4:56 PM IST
ఫిరాయింపు ఎమ్మెల్యేల కంటే.. రెడ్ లైట్ ఏరియావాళ్లు నయం : సీపీఐ నారాయణ
సీపీఐ నారాయణ(File)
news18-telugu
Updated: June 17, 2019, 4:56 PM IST
పార్టీ ఫిరాయింపులపై సీపీఐ నేత నారాయణ తీవ్ర స్థాయిలో స్పందించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేల కంటే ముంబై రెడ్ లైట్ ఏరియావాళ్లు నయం అని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు.తెలంగాణలో కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని.. ఆయన వల్ల రాష్ట్రం అభివృద్దిలో వెనక్కి పోతోందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే నిధులు ఇస్తామని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వమని కేసీఆర్ చెబుతున్నారని ఆరోపించారు. అభివృద్ది కోసం టీఆర్ఎస్‌లో చేరడం తప్ప మరో మార్గం లేకపోతే ఇక ఎన్నికలు నిర్వహించడం దేనికి అని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఫిరాయింపులపై ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరిని తాము లాక్కోబోమని.. ఒకవేళ వారు తమ పార్టీలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాలని చెప్పిన సంగతి తెలిసిందే. లేనిపక్షంలో వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఆయన విన్నవించారు. జగన్ స్టాండ్‌తో కేసీఆర్‌ తీరును ఇప్పుడు చాలామంది విమర్శిస్తున్నారు.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...