సాధ్వి ప్రగ్యాసింగ్‌పై వైద్యుడి అసభ్యకర వ్యాఖ్యలు.. హిందువులపైనా..

గత రెండేళ్లుగా నిషాద్ హిందువులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నట్లు తివారీ మీడియాకు తెలిపాడు.

news18-telugu
Updated: May 17, 2019, 1:24 PM IST
సాధ్వి ప్రగ్యాసింగ్‌పై వైద్యుడి అసభ్యకర వ్యాఖ్యలు.. హిందువులపైనా..
ప్రగ్యా సింగ్ ఠాకూర్ ( ఫైల్ చిత్రం)
news18-telugu
Updated: May 17, 2019, 1:24 PM IST
భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ముంబై వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన సునిల్ కుమార్ నిషాద్(38) అనే హోమియోపతి వైద్యుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా, హిందువులు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో రవీంద్ర తివారీ అనే కార్యకర్త ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, గత రెండేళ్లుగా నిషాద్ హిందువులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నట్లు తివారీ మీడియాకు తెలిపాడు. కాగా, నిషాద్ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ స్థాపించిన మైనారిటీ ఫెడరేషన్‌లో సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది. ఈవీఎంల పనితీరుపైనా పలు పోస్టులు పెట్టినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, నాథూరామ్ గాడ్సే గొప్ప దేశ‌భ‌క్తుడని, ఆయన ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని, గాడ్సే ఉగ్రవాది అన్న వారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమెకు మద్దతుగా కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే, ఓ బీజేపీ నేత కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...