భారత్‌పై అతిపెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం... ఆ మూడు రాష్ట్రాల్లో హైఅలర్ట్

టెర్రిస్టులు ప్రధానంగా మూడు రాష్ట్రాలపై నిఘా పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

news18-telugu
Updated: November 10, 2019, 4:58 PM IST
భారత్‌పై అతిపెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం... ఆ మూడు రాష్ట్రాల్లో హైఅలర్ట్
ప్రతీకాత్మక చిత్రం..
news18-telugu
Updated: November 10, 2019, 4:58 PM IST
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు అనంతరం దేశమంతా హై అలర్ట్ నెలకొంది. ప్రధానంగా భారత్‌పై అతిపెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. అయోధ్య తీర్పు మరికొన్నిరోజుల్లో వెలువడుతుందన్న వార్తలు ప్రారంభమైనప్పటి నుంచి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కదలికలు తీవ్రం అయ్యాయి. ఇప్పుడు తీర్పు రావడంతో భారీ దాడులకు పాల్పడేందుకు ఉగ్ర సంస్థ పొంచి రెడీగా ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) నిఘా సంస్థలు హెచ్చరించాయి. దీనిపై కేంద్రానికి సమాచారం అందించాయి. టెర్రిస్టులు ప్రధానంగా మూడు రాష్ట్రాలపై నిఘా పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై టెర్రరిస్టులు దృష్టి పెట్టాయని  సమాచారం. మొత్తానికి అతి పెద్ద విధ్వంసానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్టు తమకు సమాచారం అందిందని ఓ ఉన్నతస్థాయి అధికారి వెల్లడించారు. దీంతో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...