ములాయం సింగ్‌కు అస్వస్థత.. ముంబై ఆసుపత్రిలో చేరిక..

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నఆయన మూడు రోజుల క్రితం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

news18-telugu
Updated: December 29, 2019, 3:23 PM IST
ములాయం సింగ్‌కు అస్వస్థత.. ముంబై ఆసుపత్రిలో చేరిక..
ములాయం సింగ్ యాదవ్ (File Photo)
  • Share this:
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నఆయన మూడు రోజుల క్రితం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సలహా మేరకే లక్నో నుంచి ముంబైకి వచ్చినట్టు ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపారు. ప్రస్తుతం ములాయంకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని,ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. డిశ్చార్జి ఎప్పుడనేది వైద్యులు సాయంత్రం లోగా చెబుతామన్నారని తెలిపారు.

కాగా,గత జూన్ నెలలో మూత్ర సంబంధిత సమస్యతో ములాయం గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. లక్నో నుండి ఢిల్లీకి చార్టెడ్ విమానంలో ఆయన్ను తరలించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన ఆరోగ్యం కుదటపడింది. మళ్లీ ఇంతలోనే మరో ఆరోగ్య సమస్య తలెత్తడంతో ములాయం కుటుంబ సభ్యులు,పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.First published: December 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు