హోమ్ /వార్తలు /రాజకీయం /

ఆ సెంటిమెంటుతోనే నేడు ఊపందుకున్న నామినేషన్లు.. జగన్, లోకేశ్, కవిత..

ఆ సెంటిమెంటుతోనే నేడు ఊపందుకున్న నామినేషన్లు.. జగన్, లోకేశ్, కవిత..

ఎంపీ కవిత, మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీ అధినేత జగన్(File)

ఎంపీ కవిత, మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీ అధినేత జగన్(File)

శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తే ఎన్నికల్లో కలిసొస్తుందని పురోహితులు సూచించడం వల్లే నేడు నామినేషన్ దాఖలు చేసేందుకు వీరంతా సిద్దమయ్యారు. జన్మ నక్షత్రం ప్రకారం కొందరు.. పేరు బలాన్ని బట్టి మరికొందరు.. తిథి, రాశులను బట్టి ఇంకొందరు.. మొత్తానికి చాలామంది నేతలు ముహూర్త బలంతోనే నామినేషన్ దాఖలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  రాజకీయాల్లో రాణించాలంటే ప్రజాదరణ ఉండాలి. మరి ప్రజాదరణ దక్కాలంటే ఏం చేయాలి..? సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలి.. సందర్భానికి తగ్గట్టు వ్యవహరించి ప్రజలను మెప్పించగలిగాలి.మాట తీరు, వ్యవహార శైలి ప్రతీది జనాన్ని ఆకర్షించేదిగా ఉండాలి. అయితే ఇవన్నీ ఉన్నా.. ఎన్నికల్లో గెలుస్తారా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అందుకే దేవుడిపై భరోసాతో.. ముహూర్త బలంతో రంగంలోకి దిగుతుంటారు కొందరు నాయకులు.ప్రస్తుత రాజకీయాల్లో చాలామంది నాయకులు ముహూర్త బలం అనే సెంటిమెంటును ఫాలో అవుతున్నవారే. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అందరికంటే ముందు వరుసలో ఉంటారు. అభ్యర్థుల జాబితా ప్రకటించినా.. బహిరంగ సభలు నిర్వహించినా.. ఏ పని మొదలుపెట్టినా.. ముహూర్తం చూసుకోనిదే ఆయన ముందుకు కదలరు.


  అసలు విషయానికొస్తే.. తెలుగు పంచాంగం ప్రకారం మార్చి 22వ తేదీ శుక్రవారం మంచి ముహూర్తం అని పురోహితులు చెబుతున్నారు. తిథి విదియతో పాటు హస్తా నక్షత్రంతో శుక్రవారం శుభ గడియలు ఉన్నాయని అంటున్నారు. అందుకే శుక్రవారం నాడు నామినేషన్లు వేసేందుకు చాలామంది నేతలు సిద్దమయ్యారు. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి నారా లోకేశ్, నిజామాబాద్ ఎంపీ కవిత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, రాప్తాడు ఎమ్మెల్యేగా పరిటాల శ్రీరామ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.


  శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తే ఎన్నికల్లో కలిసొస్తుందని పురోహితులు సూచించడం వల్లే నేడు నామినేషన్ దాఖలు చేసేందుకు వీరంతా సిద్దమయ్యారు. జన్మ నక్షత్రం ప్రకారం కొందరు.. పేరు బలాన్ని బట్టి మరికొందరు.. తిథి, రాశులను బట్టి ఇంకొందరు.. మొత్తానికి చాలామంది నేతలు ముహూర్త బలంతోనే నామినేషన్ దాఖలు చేస్తున్నారు. చూడాలి మరి.. ముహూర్త సెంటిమెంట్ ఎవరెవరిని గెలిపిస్తుందో.. ఎవరెవరిని ఓడిస్తుందో..?

  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Balakrishna, Lok Sabha Election 2019, Nara Lokesh, Telangana Lok Sabha Elections 2019, Ys jagan

  ఉత్తమ కథలు