ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి టార్గెట్ చేశారు కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం. రాష్టంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని చంద్రబాబు పదే పదే వ్యాఖ్యానించడాన్ని ముద్రగడ తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో అనేక అంశాలను ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారు. టీడీపీ అధికారంలోకి ఉన్న సమయంలో ఎస్ఐ నుంచి డీజీపీ వరకు అందరినీ అదుపులో పెట్టుకున్నారని విమర్శించారు. కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో చంద్రబాబు రెండు చేతులు చూపించడం సంస్కారమా అని ముద్రగడ ప్రశ్నించారు.
కోడెల లోకేశ్ గురించి ప్రశ్నించినప్పుడు ఆయనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని ముద్రగడ తన లేఖలో ఆరోపించారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు కారణంగానే 30 మంది చనిపోయారని విమర్శించారు. కాపు ఉద్యమం సమయంలో తమ కుటుంబాన్ని ఎంతగా వేధించారో మర్చిపోయారా అంటూ చంద్రబాబును తన లేఖలో ప్రశ్నించారు ముద్రగడ. కోడెల తరహాలోనే తమ కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునే స్థాయిలో చంద్రబాబు వేధించారని... అయితే దేవుడి దయతో తాము తప్పించుకున్నామని అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.