షర్మిల పేరును ప్రస్తావిస్తూ... ఏపీ సీఎంకు ముద్రగడ లేఖ

మీ సోదరి షర్మిల పై సోషల్ మీడియాలో బూతులు వస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారన్నారు ముద్రగడ,తాను కూడా మీ సోదరి షర్మిల లాంటి వాడినేనని గ్రహించాలన్నారు.

news18-telugu
Updated: July 29, 2019, 1:17 PM IST
షర్మిల పేరును ప్రస్తావిస్తూ... ఏపీ సీఎంకు ముద్రగడ లేఖ
ముద్రగడ పద్మనాభం
  • Share this:
ఏపి సిఎం జగన్ కు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం EWS పది శాతం రిజర్వేషన్‌లో  ఐదు శాతం కాపులకు కేటాయించడం కుదరదని సీఎం అన్నట్లు వార్తలు వస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. అదే నిజమైతే ఏ గౌరవ కోర్టులు ఆ విధమైన వ్యాఖ్యలు చేశాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నిజంగా కోర్టులు ఈ అంశం పై స్టే ఇచ్చినట్లు సీఎం బహిర్గతం చేస్తే ... వచ్చే ఎన్నికల వరకు తనతో పటు కాపులంతా కూడా నోటికి ప్లాస్టర్లు వేసుకుంటారన్నారు ముద్రగడ.

మా జాతికి మీరు ఇస్తానన్న రెండు వేల కోట్లకు ఆశపడి మీకు ఓట్లు వేశారని భావిస్తున్నారా? లేదా మేము బానిసలుగానే బతకాలని మీరు భావిస్తున్నారా? అని జగన్‌ను లేఖ ద్వారా ప్రశ్నించారు. మాట తప్పను మడమ తిప్పను అనే మీరు నిత్యం లోక్ సభ లో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటుంటే మీ మాట మీ మడమ ఏమైందని సీఎంను ముద్రగడ నిలదీశారు.

ముద్రగడ లేఖ


బానిసలుగా బ్రతుకుతున్న మా జాతి ఆశలపై నీళ్లు చల్లడం మీకు భావ్యమా అంటూ లేఖలో పేర్కొన్నారు. మీ సోదరి షర్మిల పై సోషల్ మీడియాలో బూతులు వస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నన్ను కాపు ద్రోహి, స్వార్థపరుడు, ముద్రగడ అమ్ముడుపోయాడు అంటూ వివిధ పత్రికలు రాతలు వస్తున్నాయని లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు ముద్రగడ. అయినా తానేమి బెదరను, భయపడను అన్నారు. తాను కూడా మీ సోదరి షర్మిల లాంటి వాడినేనని గ్రహించాలన్నారు.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>