బీజేపీలోకి ధోని... రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ అదేనా ?

ఈ ఏడాది అక్టోబరులో ఝా ర్ఖండ్‌ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తాడని.. సండే గార్డియన్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

news18-telugu
Updated: July 8, 2019, 7:59 AM IST
బీజేపీలోకి ధోని... రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ అదేనా ?
బీజేపీలోకి ధోని... రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ అదేనా ? MS Dhoni to join BJP ahead of jharkhand lok sabha Elections 2019?
news18-telugu
Updated: July 8, 2019, 7:59 AM IST
టీమిండియా సీనియర్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ.. ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారాడు.రిటైర్మెంట్ తర్వాత ధోనీ రాజకీయాల్లోకి వెళుతున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తానెప్పుడు రిటైర్‌ అవుతానో తనకే స్పష్టత లేదని మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తాజాగా ప్రకటించాడు. అయితే .. ప్రపంచకప్‌ తర్వాత ధోనీ రిటైర్మెంట్‌ గ్యారంటీ అనే కథనాలు జోరుగా ప్రచారమవుతున్నాయి. రిటైర్మెంట్ విషయం పక్కన పెడితే... రిటైర్మెంట్‌ తర్వాత ధోనీ రాజకీయాల్లో చేరుతాడనే ప్రచారమూ వినిపిస్తోంది. బీజేపీ అభిమానులు ఈ విషయాన్ని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ధోనీ, అమిత్ షా ఉన్న ఫొటోలను దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు.

ఈ ఏడాది అక్టోబరులో ఝా ర్ఖండ్‌ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తాడని.. సండే గార్డియన్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి రాగానే ధోనీ బీజేపీలో చేరుతాడని విశ్వసనీయవర్గాల సమాచారం అంటూ ఆ కథనంలో వెల్లడించింది. బీజేపీ సర్కారుపై ఝార్ఖండ్‌ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

డిసెంబర్‌లో జరగనున్న జార్ఖండ్ ఎన్నికల్లో ధోనీ పాపులారిటీ పార్టీకి ఉపయోగపడుతుందని.. ఆ దిశగానే బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుందన్నది ఆ వార్తల సారాంశం. జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడానికి జార్ఖండ్‌లో ధోనీ ప్రజాదరణను వాడుకోవాలని బీజేపీ భావిస్తోందని.. ఒక వేళ తమ పార్టీలో చేరడానికి ధోనీ ఇష్టపడక పోతే కనీసం ప్రచారానికైనా ఉపయోగించుకోవాలని ఆ పార్టీ నాయకత్వం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

First published: July 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...