చంద్రబాబుతో పోల్చుతూ కేసీఆర్‌పై మందక‌ృష్ణ విసుర్లు

#TelanganaElections2018 |ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి బహిరంగసభ వేదికగా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ. ఏపీలో పాలన సాగిస్తున్న చంద్రబాబుతో పోల్చుతూ.. కేసీఆర్‌పై విసుర్లతో విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: November 28, 2018, 7:13 PM IST
చంద్రబాబుతో పోల్చుతూ కేసీఆర్‌పై మందక‌ృష్ణ విసుర్లు
ఖమ్మం సభలో మందకృష్ణ మాదిగ. పక్కన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
news18-telugu
Updated: November 28, 2018, 7:13 PM IST
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాలమాదిగలకు అధికారంలోకి వచ్చాక కేసీఆర్ తీరని అన్యాయం చేస్తే.. ఏపీలో చంద్రబాబు నాయుడు అగ్రతాంబూలం ఇచ్చారని మందకృష్ణ అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో మొట్టమొదటగా తమకు చంద్రబాబు మద్దతు తెలిపారని.. కేసీఆర్ మాత్రం మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ బిల్లు పాస్ అయ్యేందుకు మహిళలుగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, అప్పటి లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ కీలకపాత్ర పోషించారని.. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క మహిళామంత్రి కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ఏపీలో మాత్రం ఇద్దరు మహిళా మంత్రులు కీలకశాఖలు నిర్వర్తిస్తున్నారని మందకృష్ణ గుర్తు చేశారు.

తెలంగాణ సాధనకు అమరుల త్యాగం ఎంత ముఖ్యమో.. రాష్ట్ర ఏర్పాటుకు సోనియా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం కూడా అంతే కీలకమైనదని మందకృష్ణ చెప్పారు. అయితే, 2014లో కాంగ్రెస్‌ను ఓడించి సోనియాను గౌరవించడంలో తెలంగాణ ప్రజలు పొరపాటు చేశారని.. ఇప్పుడు మరోసారి పొరపాటు చేయకుండా కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో బాగుపడింది ఒక్క కేసీఆర్ కుటుంబమేనని, ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మందకృష్ణ మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం గెలవాలంటే కేసీఆర్ కుటుంబం చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

 ఇది కూడా చదవండి
First published: November 28, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...