ప్రజాకూటమికి మాదిగల సంపూర్ణ మద్దతు: మందకృష్ణ మాదిగ

తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రజాకూటమికి మరోపార్టీ జతకట్టింది. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలోని ఎమ్మార్పీఎస్.. ప్రజాకూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

news18-telugu
Updated: November 24, 2018, 5:36 PM IST
ప్రజాకూటమికి మాదిగల సంపూర్ణ మద్దతు: మందకృష్ణ మాదిగ
manda krishna support to mahakutami
  • Share this:
ప్రజాకూటమికి మాదిగల మద్దతు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరిందని.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనను పాలదోలేందుకు కూటమికి మదిగల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కూటమి విజయానికి భాగస్వామ్యపక్షాలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

మందకృష్ణతో భేటీ అయిన కూటమి భాగస్వామ్య పక్షాల నేతలు ఎస్సీ  వర్గీకరణకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. వర్గీకరణ సాధనలో తమ సహకారం అందిస్తామని చెప్పారు. అయితే, ఈ సందర్భంగా కూటమి నేతల ఎదుట మందకృష్ణ పలు డిమాండ్లు ఉంచినట్టు తెలిసింది.

ఎస్పీవర్గీకరణ అంశాన్ని ప్రజాకూటమి మేనిఫెస్టోలో చేర్చాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మహాకూటమి అధికారంలో వస్తే మండలిలో ఎస్సీలకు అవకాశం కల్పించాలన్నారు. కూటమిలోని అన్ని పార్టీలు ఎస్సీవర్గీకరణపై రూట్‌మ్యాప్‌ను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. డిమాండ్లన్నింటికీ కూటమి నేతలు సానుకూలంగా స్పందించడంతో మందకృష్ణ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

 

First published: November 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు