వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పాకిస్థాన్ జైళ్లలో ఉన్న తెలుగు మత్స్యకారుల విడుదలకు అక్కడి ప్రభుత్వం ఒప్పుకుంది. ఇదే విషయాన్ని భారత విదేశాంగ శాఖకు తెలిపింది. మొత్తం 20 మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారుల్ని జనవరి 6న వాఘా సరిహద్దు దగ్గర భారత అధికారులకు పాకిస్థాన్ అప్పగించబోతోంది. ఇందుకు సంబంధించిన తెలుగు మత్స్యకారుల జాబితాను భారత విదేశాంగ శాఖకు పాకిస్థాన్ ప్రభుత్వం పంపింది. వాళ్లంతా పొట్టకూటికోసం గుజరాత్ వలస వెళ్లిన మత్స్యకారులు. 2018 డిసెంబరులో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేశారు. పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి వచ్చారంటూ అరెస్టు చేశారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్... పాదయాత్రలో ఉండగా... బాధితుల కుటుంబ సభ్యులు ఆయన దృష్టికి తెచ్చారు. ఆ సంగతేంటో చూడమనీ, వాళ్లను విడుదల చేయించమని... జగన్... ఎంపీ విజయసాయిరెడ్డిని ఆదేశించారు. సరేనన్న విజయసాయిరెడ్డి... అప్పటి నుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. చివరకు ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి.
పాకిస్థాన్ విడుదల చేయబోతున్న తెలుగు మత్స్యకారులు :
ఎస్.కిశోర్, తండ్రి అప్పారావు
నికరందాస్ ధనరాజ్, తండ్రి అప్పన్న
గరమత్తి, తండ్రి రాముడు
ఎం.రాంబాబు, తండ్రి సన్యాసిరావు
ఎస్.అప్పారావు, తండ్రి రాములు
జి.రామారావు, తండ్రి అప్పన్న
బాడి అప్పన్న, తండ్రి అప్పారావు
ఎం.గురువులు, తండ్రి సతియా
నక్కా అప్పన్న, తండ్రి లక్ష్మయ్య
నక్క నర్సింగ్, తండ్రి లక్ష్మణ్
వి.శామ్యూల్, తండ్రి కన్నాలు
కె.ఎర్రయ్య, తండ్రి లక్ష్మణరావు
డి.సురాయి నారాయణన్, తండ్రి అప్పలస్వామి
కందా మణి, తండ్రి అప్పారావు
కోరాడ వెంకటేష్, తండ్రి నరసింహులు
శేరాడ కళ్యాణ్, తండ్రి అప్పారావు
కేశం రాజు, తండ్రి అమ్మోరు
భైరవుడు, తండ్రి కొర్లయ్య
సన్యాసిరావు, తండ్రి మీసేను
సుమంత్, తండ్రి ప్రదీప్
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.