బీజేపీలో టీడీపీ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసా?

ఇటీవలే టీడీపీ రాజ్యసభ ఎంపీలు వై.సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ బీజేపీ కండువా కప్పుకొన్నారు.

news18-telugu
Updated: June 21, 2019, 9:11 AM IST
బీజేపీలో టీడీపీ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసా?
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
తాజాగా ముగ్గురు టీడీపీ ఎంపీలు... పార్టీ ఫిరాయించేశారు. టీడీపీ పార్టీ ఓటమి పాలవ్వగానే.. మరో ఆలోచన లేకుండా బీజేపీ తీర్థం పుచ్చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఎంపీ ... బీజేపీలో చేరికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పార్టీ మారుతారన్న విషయం ... టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందే తెలుసన్నారు ఎంపీ టీజీ వెంటకేష్.  తాము పార్టీ మారుతన్నట్టుగా  వారం రోజుల క్రితమే టీడీపీ చీఫ్ చంద్రబాబుకు చెప్పినట్టుగా టీజీ వెంకటేష్ ప్రకటించారు. గురువారం నాడు ఆయన ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడొద్దని చంద్రబాబు నాయుడు తమకు సూచించారని ఆయన గుర్తు చేశారు.

రాజ్యసభలో టీడీపీ ఎంపీలు పార్టీని వీడుతారనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని టీజీ వెంకటేష్ మాటలను బట్టి అర్ధమౌతోంది. ప్రజాభిప్రాయం మేరకే తాము  బీజేపీలో చేరాలని  నిర్ణయం  తీసుకొన్నట్టుగా  టీజీ వెంకటేష్ చెప్పారు.  రాయలసీమ అభివృద్ది కోసమే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. విద్యార్థి దశలోనే తాను బీజేపీ  అనుబంధ సంస్థలో పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. టీడీపీకే రాజీనామా చేశామని.... ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదన్నారు. తాము నలుగురు ఎంపీలు సంతకాలు చేసి రాజ్యసభ ఛైర్మెన్‌కు లేఖను ఇచ్చామన్నారు.

ఇటీవలే టీడీపీ రాజ్యసభ ఎంపీలు వై.సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ బీజేపీ కండువా కప్పుకొన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, బీజేపీ రాజ్యసభాపక్ష నేత ధావర్ చంద్ గెహ్లాట్ సమక్షంలో వారు కమలం తీర్థం పుచ్చుకున్నారు. కాలికి గాయం కావడంతో మరో ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే, ఆయన కూడా బీజేపీలో విలీనం చేయాలన్న లేఖ మీద సంతకం చేసి తమ సమ్మతిని తెలియజేశారు.

First published: June 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు