ఎవరి రాజకీయం వారిది... బీజేపీలోకి తండ్రి... టీడీపీలోనే ఉంటానన్న కుమారుడు

మరో ముగ్గురు టీడీపీ ఎంపీలతో కలిసి బీజేపీలో చేరారు టీజీ వెంకటేశ్. దీంతో ఆయన కుమారుడు టీజీ భరత్ కూడా బీజేపీలో చేరడం లాంఛనమే అని అంతా భావించారు. కానీ విషయంలో తన దారి వేరు అని ప్రకటించాడు టీజీ భరత్.

news18-telugu
Updated: June 22, 2019, 1:01 PM IST
ఎవరి రాజకీయం వారిది...  బీజేపీలోకి తండ్రి... టీడీపీలోనే ఉంటానన్న కుమారుడు
టీజీ వెంకటేశ్, టీజీ భరత్
  • Share this:
ఒకే కుటుంబంలోని ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉండటం కొత్తేమీ కాదు. తాజాగా ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కుటుంబం కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన టీజీ వెంకటేశ్... రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరో ముగ్గురు టీడీపీ ఎంపీలతో కలిసి బీజేపీలో చేరారు టీజీ వెంకటేశ్. దీంతో ఆయన కుమారుడు టీజీ భరత్ కూడా బీజేపీలో చేరడం లాంఛనమే అని అంతా భావించారు. కానీ విషయంలో తన దారి వేరు అని ప్రకటించాడు టీజీ భరత్. తన తండ్రి బీజేపీలో చేరినా... తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ విషయమై తాను తన తండ్రితో మాట్లాడానని... వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ నీకు ఉందని తన తండ్రి చెప్పారని టీజీ భరత్ అన్నారు.

రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి తాను కృషి చేస్తానన్న భరత్... ఈ విషయాన్ని విదేశాల్లోనే ఉన్న టీడీపీ యువనేత లోకేశ్‌కు ఫోన్ చేసి చెప్పానని అన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత చంద్రబాబు, లోకేశ్‌లను కలుస్తానని భరత్ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన టీజీ భరత్... స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డికి కాదని ఎన్నికల్లో టీజీ భరత్‌కు టికెట్ చంద్రబాబు టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.


First published: June 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు