బీజేపీలో టచ్‌లో ఉన్న వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు?

సుజనా చౌదరి వ్యాఖ్యలతో రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. వైసీపీతో టచ్‌లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: November 21, 2019, 6:06 PM IST
బీజేపీలో టచ్‌లో ఉన్న వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు?
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీతో సహా ప్రతిపక్ష టీడీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. జెరూసలేం యాత్రకు ఆర్థికసాయం పెంచిన ప్రభుత్వం హిందువుల అమర్‌నాథ్ యాత్రకు ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. ఏపీలో ఆరు నెలల కాలంలో ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, రాష్ట్రంలో రివర్స్ పాలన కొనసాగుతోందన్నారు. 22 మంది ఎంపీలు ఉన్నా వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని సుజనా చౌదరి ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, ఇంగ్లీషు చెప్పగలిగిన ఉపాధ్యాయులు ..ఇతర వసతులు కల్పించాక నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రెండు, మూడు తరాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని సుజనా చౌదరి అన్నారు. వెంకయ్యనాయుడు లాంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు.

జెరూసలేం, మక్కా వెళ్లేందుకు రాయితీలు ఇవ్వడం సరికాదని సుజనా చౌదరి అన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులను వినియోగించే అధికారం ఎవరు ఇచ్చారని నిలదీశారు. రేపు హిందూ దేవాలయాలకు వెళ్లేందుకు అడిగితే వారికి ఇస్తారా? అని ప్రశ్నించారు. కావాలంటే ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. టీటీడీ యాక్ట్ ని ఉల్లంగిస్తూ ఆ నిధులను ఇతర పనులకు వినియోగించే ప్రయత్నం చేస్తున్నారని సుజనా చౌదరి ఆరోపించారు. కేంద్రం అన్ని అంశాలను పరిశీలిస్తోందని.. పోలవరం పై లెక్కలు చెప్తేనే రావాల్సిన రూ.1800 కోట్లు వస్తాయని స్పష్టం చేశారు.

సుజనా చౌదరి వ్యాఖ్యలతో రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. వైసీపీతో టచ్‌లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ జరుగుతోంది. తాజాగా నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణంరాజు మీద సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు భాష, ఇంగ్లీష్ మీడియం వివాదంపై ఆయనకు క్లాస్ తీసుకున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు హాజరైన రఘురామకృష్ణంరాజును ప్రధాని మోదీ పలకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘రాజుగారూ బాగున్నారా?’ అని మోదీ వైసీపీ ఎంపీ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎంపీలు వేమిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. దీంతో కొత్త చర్చకు దారితీసింది.

మరోవైపు టీడీపీ నుంచి వీడాలనుకున్న వల్లభనేని వంశీ తొలుత బీజేపీతో చర్చలు జరిపారు. అనంతరం సీఎం జగన్‌ను కలిశారు. స్వయంగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాంతో చర్చలు జరిపారు. విశాఖ జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే, అలాంటి సంకేతాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. అయితే, వైసీపీ నుంచి కూడా టచ్‌లో
Published by: Ashok Kumar Bonepalli
First published: November 21, 2019, 6:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading