వైసీపీలోకి టీడీపీ ఎంపీ ఫ్యామిలీ ? ఏపీలో సీన్ మారుతోందా ?

ప్రతీకాత్మక చిత్రం

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ, సీనియర్ రాజకీయ నేత రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీ మెల్లమెల్లగా వైసీపీ వైపు అడుగులు వేస్తోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా రాయపాటి సోదరుడు శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.

  • Share this:
    ఏపీలో మరోసారి అధికారం తమదే అని టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతగా ధీమా వ్యక్తం చేస్తున్నా... ఆ పార్టీ నేతల్లో మాత్రం ఈ విషయంలో నమ్మకం కలగడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ, సీనియర్ రాజకీయ నేత రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీ మెల్లమెల్లగా వైసీపీ వైపు అడుగులు వేస్తోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా రాయపాటి సోదరుడు శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.

    టీడీపీ తరపున ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడ్డ రాయపాటి శ్రీనివాస్... ప్రత్యేక హోదా విషయంలో టీడీపీని టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీ, జనసేనలను టార్గెట్ చేసిన రాయపాటి శ్రీనివాస్... వైసీపీని మాత్రం విమర్శించలేదు. అయితే తన కుమారుడు రాయపాటి మోహన్ సాయికృష్ణ రాజకీయ భవిష్యత్తు కోసమే రాయపాటి శ్రీనివాస్ వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే రాయపాటి సాంబశివరావు అనుమతి లేకుండానే ఆయన సోదరుడు టీడీపీపై ఈ రకమైన విమర్శలు చేశారా అనే చర్చ కూడా నడుస్తోంది.

    ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్న రాయపాటి ఫ్యామిలీ... మెల్లమెల్లగా వైసీపీ వైపు అడుగులు వేస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తన కుమారుడు రంగబాబుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు ఇవ్వనందుకు టీడీపీపై అసంతృప్తితో ఉన్న రాయపాటి సాంబశివరావు... మొదట సోదరుడు శ్రీనివాస్ కుటుంబాన్ని వైసీపీలోకి పంపి ఆ తరువాత తాను కూడా పార్టీ మారతారేమో అనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న రాయపాటి కుటుంబం పొలిటికల్ రూటు మారుతున్నట్టు కనిపిస్తోంది.
    First published: