కొంతకాలంగా సొంత పార్టీపై నిరసన గళం వినిపిస్తున్న నరసారపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ నాయకత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చే వివరణను బట్టి ఆయనపై చర్యలు ఉంటాయని వైసీపీ నాయకత్వం ప్రకటించారు. తాజాగా తనకు పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై స్పందించిన రఘురామ కృష్ణంరాజు... పార్టీ తరుఫున షోకాజ్ నోటీస్ పంపిన విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా ఉంటుందన్న ఆయన... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా అని ప్రశ్నించారు. ఆ క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా ? అని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ సంఘానికి ఛైర్మన్, సభ్యులెవరని అన్నారు. క్రమశిక్షణ సంఘం మినిట్స్ ఉంటే తనకు పంపాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కోరారు. మొత్తానికి రఘురామకృష్ణంరాజు తీరు చూస్తుంటే.. తనకు షోకాజ్ ఇచ్చిన సొంత పార్టీపై రివర్స్ ఎటాక్ మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.