Home /News /politics /

Andhra Pradesh: మరో రెండు రోజుల్లో విజయసాయి బెయిల్ రద్దు పటిటిషన్.. వదిలేది లేదంటున్న ఎంపీ..

Andhra Pradesh: మరో రెండు రోజుల్లో విజయసాయి బెయిల్ రద్దు పటిటిషన్.. వదిలేది లేదంటున్న ఎంపీ..

తరువాత టార్గెట్ విజయసాయిరెడ్డి

తరువాత టార్గెట్ విజయసాయిరెడ్డి

ఇప్పటికే ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందా..? కొనసాగుతుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఇదే సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ మరో బాంబ్ పేల్చారు.. విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేస్తాను అంటూ స్పష్టం చేశారు.

    ఏపీలో ప్రస్తుతం బెయిల్ రద్దు పిటిషన్లు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా జరిగిన విచారణలో సీఎం జగన్ బెయిల్ రద్దు అంశం కోర్టు విచక్షణ అధికారాలకే వదిలేస్తున్నామని సీబీఐ అధికారులు చెప్పడంతో.. విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది కోర్టు. మరోవైపు రఘురమా తరుపున పిటిషనర్లు, జగన్ తరపు పిటిషనర్లు ఇప్పటికే కోర్టుకు లిఖిత పూర్వక సమాధానాలు సమర్పించారు. సీబీఐ మాత్రం కోర్టుదే ఫైనల్ నిర్ణయం అని చెప్పేసింది. దీంతో ఆగస్టు 25న తుది తీర్పు వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశం తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది. ఆ రోజు జగన్ బెయిల్ రద్దు అవుతుందా.? కొనసాగుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇదే సమయంలో మరో బాంబ్ పేల్చారు వైసీబీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. విదేశాలకు పారిపోయిందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందకే ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టులో త్వరలోనే పిటిషన్ వేస్తాను అంటున్నారు..

    ప్రస్తుతం వైసీపీకి రఘరామ అంశం తీవ్ర తలనొప్పిగా మారింది. అటు జాతీయ స్థాయిలో పార్లమెంట్ వేదికగా ఏపీ ప్రభుత్వ పరువుకు డ్యామేజ్ అవుతోందని.. మరోవైపు ఇప్పుడు వరుస పిటిషన్లతో టెన్షన్ పెడుతున్నారు. ఎదో ఒక విధంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన ముప్పుతిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా 2 రోజుల్లో విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలని పిటిషన్ వేస్తానని రఘురామ ప్రకటించడం కలకలం రేపుతోంది.

    ఇప్పటికే ఆర్థిక నేరాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జిషీట్లలో ఏ1 ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యాలను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. అయితే తమను ఇంతలా ఇబ్బంది పెడుతున్న రఘురామను ఏం చేయాలో తెలియన వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏదో ఒక కేసు పేరుతో అరెస్ట్ చేసినా కోర్టును ఆశ్రయిస్తున్నారు. అటు ఎంపీ పదవి నుంచి వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసినా.. ఆ వ్యవహారం ముందుకు కదలడం లేదు. దీంతో ఆయన పేరు ఎత్తు తేనే వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, MP raghurama krishnam raju, Vijayasai reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు