హోమ్ /వార్తలు /National రాజకీయం /

RRR: వైసీపీకి ఊహించని షాక్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఎంపీ రఘురామ భేటీ.. కారణం అదేనా..?

RRR: వైసీపీకి ఊహించని షాక్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఎంపీ రఘురామ భేటీ.. కారణం అదేనా..?

అమిత్ షాతో ఎంపీ రఘురామ భేటీ

అమిత్ షాతో ఎంపీ రఘురామ భేటీ

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎంలు, కీలక ఎంపీలకు అమిత్ షా అపాయింట్ మెంట్ అంత ఈజీగా దొరకదు అంటారు. ఏపీ సీఎం జగన్ సైతం చాలాసార్లు అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూసిన వారిలో ఉన్నారు. కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంపీ రఘురామ ఇప్పుడు అమిత్ షాతో భేటీ అవ్వడం.. చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...

రేపో మాపో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పదవికి రాజీనామా చేస్తారు. స్పీకర్ చర్యలు తీసుకుంటారు.. అతడి పై వేటు తప్పదని వైసీపీ ఎంపీలు పదే పదే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం.. వైసీపీకి షాక్ తగిలినట్టు అయ్యింది. ప్రస్తుతం కేంద్రానికి వ్యతిరేకంగా వైపీపీ హస్తినలో పోరాడుతోంది. ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం చెబుతుంటే.. వైసీపీ ఎంపీలు ఇటు రాజ్యసభ, అటు లోక్ సభలో గత రెండు రోజులగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఎదుటే కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తొలిసారి కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కేంద్రం తీరు చాలా దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు. ఇలా ఏపీ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య గ్యాప్ పెరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంపీ రఘురామ నేరుగా అమిత్ షాను కలవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు.. మరోవైపు త్వరలో పలు రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలతో బిజీగా ఉన్న ఆయన ఎవరికైనా అపాయింట్ మెంట్ ఇవ్వడం చాలా కష్టం.. ఏపీ సీఎం జగన్ సైతం అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం చాలా సార్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేంద్ర హోం మంత్రిని రఘురామ కలవడం వెనుక తెర వేనుక ఏదో రాజకీయం జరుగుతోంది.. హస్తినలో ప్రచారం జరుగుతోంది..

అయితే రఘురామ సన్నితులు చెబుతున్నదాని ప్రకారం.. ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించారని.. ముఖ్యంగా రఘురామ ఆరోగ్య పరిస్థితులపై అమిత్ షా అడిగి తెలుసుకున్నారని చెబుతున్నారు. నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆయన కీలక ఆరోపణలు చేశారు. దీంతో రఘురామపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో రఘురామ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ కేసుకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగిందా.. లేదా తనను ఏపీ పోలీసులు హింసించారని ఫిర్యాదు చేశారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. జగన్ బెయిల్ రద్దుకు మద్దుతివ్వాలని రఘురామ పలువురు ఎంపీలకు రఘురామ లేఖలు రాశారు. దీంతో రఘురామ వర్సెస్ వైసీపీగా మారింది. దీనిపైనా చర్చి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. అటు రఘురామపై అనర్హత వేయాలని వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా... రఘురామకు లేఖ రాశారు. వైసీపీ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కోరారు.

తాజాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమని రఘురామ ప్రకటించారు. తనపై అనర్హత వేటు పడదని ఆయన ధైర్యంగా చెప్పడం వెనుక అమిత్ షా అండదండలు ఉన్నాయని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

తాజాగా రఘురామ వాట్సాప్‌లో చాటింగ్ ను సీఐడీ పోలీసులు బయట పెట్టారు. అయితే దీనిపై ఆయన అమిత్ షాకు ఫిర్యాదు చేసి ఉండొచ్చనే ప్రచారం కూడా ఉంది. ఏపీలో విపక్ష నేతలపైనా ప్రభుత్వం నిఘా పెట్టిందనే అంశంపై అమిత్ షాకు ఫిర్యాదు చేయడంతో పాటు.. ఇటీవల కేంద్రం, లోక్ సభ స్పీకర్ పై ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలను ఆయన కు వివరించేందుకే కలిశారని జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. కారణం ఏదైనా ప్రస్తుతం కేంద్రం హోం మంత్రిని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో చూడాలి..

First published:

Tags: Amit Shah, Andhra Pradesh, AP News, AP Politics, MP raghurama krishnam raju

ఉత్తమ కథలు