వైఎస్ వివేకా హత్య కేసుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు

పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు వైఎస్ వివేకా నివాసంలో బెడ్ రూమ్, బాత్‌రూమ్‌లను పరిశీలించారు. భార్య సౌభాగ్యమ్మతో పాటు కూతురు సునీతను అడిగి కీలక వివరాలు తెలుసుకున్నారు.

news18-telugu
Updated: July 21, 2020, 3:30 PM IST
వైఎస్ వివేకా హత్య కేసుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు
ఎంపీ రఘురామ కృష్ణంరాజు
  • Share this:
ఏపీలో సంచలనం సృష్టించిన వైఎన్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందులలోని వైఎస్ వివేకా నివాసంలో కుటుంబ సభ్యులను ఇప్పటికే విచారించారు. సిట్ నుంచి కూడా కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై సీబీఐ విచారణ జరుగుతున్న వేళ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరుగుతుందని.. అసలు దోషులకు త్వరలోనే శిక్షపడుతుందని ఆయన అన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు రఘురామ కృష్ణంరాజు.

మంగళవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు వైఎస్ వివేకా నివాసంలో బెడ్ రూమ్, బాత్‌రూమ్‌లను పరిశీలించారు. భార్య సౌభాగ్యమ్మతో పాటు కూతురు సునీతను అడిగి కీలక వివరాలు తెలుసుకున్నారు.

కాగా, 2019 ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇంట్లోనే ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు, ఇతర గాయాలు కనిపించాయి. మాజీ సీఎం తమ్ముడు, ఓ రాజకీయ పార్టీ అధినేత అయిన జగన్ మోహన్ రెడ్డికి బాబాయి, స్వయానా మాజీ మంత్రి కూడా అయిన వైఎస్ వివేకా హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టించింది. ఐతే సాక్ష్యాలు తారుమారు చేసేందుకు జగన్ కుటుంబం ప్రయత్నించిందని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అప్పటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం జగన్ డిమాండ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే అధికారంలోకి వచ్చాక హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

ఐతే సీబీఐ విచారణ చేయాలని వివేకా కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. హత్య కేసుగా నమోదు చేయాలని, దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో మరికొందరు టీడీపీ నేతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ విచారణ జరిపితే తమను అన్యాయంగా ఇరికించే అవకాశం ఉందంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో విచారణ జరిపిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు వివేకా కుటుంబ సభ్యులను అడిగి కేసుపై వివరాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సిట్ విచారణలో వెలుగు చూసిన అంశాలపై క్షుణ్నంగా అద్యయనం చేశారు. ఎవరెవరిని విచారించాలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని.. నేటి నుంచి కీలక వ్యక్తులను విచారించనున్నారని తెలుస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: July 21, 2020, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading