లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా..! నేడే నామినేషన్..

విద్యార్థి నేతగా బీజేపీలో చేరిన ఆయన బీజేవైఎంలో అనేక హోదాల్లో పనిచేశారు.గతంలో మూడు సార్లు రాజస్తాన్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. కోటా లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు.

news18-telugu
Updated: June 18, 2019, 10:21 AM IST
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా..! నేడే నామినేషన్..
రాజస్తాన్ ఎంపీ ఓం బిర్లా (Image : Twitter)
news18-telugu
Updated: June 18, 2019, 10:21 AM IST
కొత్తగా కొలువుదీరిన లోక్‌సభకు రాజస్తాన్ ఎంపీ ఓం బిర్లాను స్పీకర్‌‌గా బీజేపీ అగ్రనాయకత్వం దాదాపుగా ఖరారు చేసింది.లోక్‌సభ స్పీకర్ స్థానానికి ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.విద్యార్థి నేతగా బీజేపీలో చేరిన ఆయన బీజేవైఎంలో అనేక హోదాల్లో పనిచేశారు. 2003లో కోటా సౌత్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శాంతి లాల్ ధరివాల్‌ను ఓడించడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. తాజా ఎన్నికల్లో కోటా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రామనరైన్‌పై విజయం సాధించారు. మొత్తంగా మూడు సార్లు రాజస్తాన్ అసెంబ్లీకి, రెండుసార్లు కోటా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.ఓం బిర్లాతో పాటు పశ్చిమ బెంగాల్ ఎంపీ అహుల్‌వాలియా, ఎంపీ రాధామోహన్ సింగ్‌ల పేర్లను కూడా స్పీకర్ స్థానం కోసం బీజేపీ అగ్ర నాయకత్వం పరిశీలించినట్టు సమాచారం.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...