హేమామాలిని బుగ్గలపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

సామాన్యుల్లోనే కాదు... సెలబ్రిటీల్లోను కూడా చాలామంది హేమమాలిని అంటే ఇష్టపడతారు. తాజాగా ఓ మంత్రి హేమామాలిని బుగ్గల్ని ఉద్దేశిస్తూ... కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: October 16, 2019, 11:39 AM IST
హేమామాలిని బుగ్గలపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
హేమా మాలిని
news18-telugu
Updated: October 16, 2019, 11:39 AM IST
బాలీవుడ్ అలనాటి అందాల హీరోయిన్లలో హేమమాలినికి ఉన్న క్రేజే వేరు. ఇప్పటికీ చాలామంది ఆమె ఫ్యాన్స్ ఉన్నారు. సామాన్యుల్లోనే కాదు... సెలబ్రిటీల్లోను కూడా చాలామంది హేమమాలిని అంటే ఇష్టపడతారు. తాజాగా ఓ మంత్రి హేమామాలిని బుగ్గల్ని ఉద్దేశిస్తూ... కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ మంత్రి పీసీ శర్మ రాష్ట్రంలోని రోడ్లను బీజేపీ ఎంసీ హేమమాలిని బుగ్గల్లా తయారు చేస్తానన్నారు. భోపాల్ నగరంలోని హబీబ్ గంజ్ ప్రాంతంలో రోడ్లను తనిఖీ చేసిన మంత్రి శర్మ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు వాషింగ్టన్ మాదిరిగానే నిర్మించారని, కాని ప్రస్థుతం రోడ్లు గుంతలు పడి మశూచి మరకలుగా మారాయన్నారు. భారీవర్షం కురిస్తే ఈ రోడ్లు ఘోరంగా మారతాయని మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆదేశాల మేర 15 రోజుల్లో రోడ్లకు మరమ్మతులు చేసి ఎంపీ హేమమాలిని బుగ్గల్లా తయారు చేస్తామని మంత్రి శర్మ మీడియాతో చెప్పారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు గోపాల్ భార్గవ గత వారం రాష్ట్రంలో రోడ్ల స్థితిగతుల పరిస్థితిపై కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని విమర్శించిన తరువాత శర్మ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రోడ్లను హేమమాలిని బుగ్గల్లా మారుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవికూడా చూడండి:

బొల్లారంలో బాంబులా పేలిన సిలిండర్First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...