మీ రుణాలు మాఫీ అయ్యాయా?...స్మృతి ప్రశ్నకు సభికుల షాకింగ్ సమాధానం

MP Lok Sabha Election 2019: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నకు సభికుల నుంచి అనూహ్య సమాధానం వచ్చింది.

news18-telugu
Updated: May 9, 2019, 11:02 AM IST
మీ రుణాలు మాఫీ అయ్యాయా?...స్మృతి ప్రశ్నకు సభికుల షాకింగ్ సమాధానం
స్మృతి ఇరానీ(ఫైల్ ఫోటో)
  • Share this:
మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి వింత అనుభవం ఎదురయ్యింది. ఆరో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ పర్యటించిన స్మృతి ఇరానీ...కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు మీ రుణాలు మాఫీ అయ్యాయా? అని ఆమె సభికులను ప్రశ్నించారు. దీనికి సభికుల నుంచి ‘లేదు’ అని సమాధానం వస్తుందని ఆమె ఆశించగా...సభికులు మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు.  సభికుల్లో పలువురు...మాఫీ అయ్యాయంటూ సమాధానం ఇవ్వడంతో బీజేపీ శ్రేణులు విస్తుపోయారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా...దీన్ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియో అసలైనదా? కాదా? అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది.
Published by: Janardhan V
First published: May 9, 2019, 11:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading