MP KAVITHA COMMENTS ON CONGRESS EX PRESIDENT SONIA GANDHI MEETING
సోనియాగాంధీ నోట చంద్రబాబు మాటలు: ఎంపీ కవిత
ఎంపీ కవిత (ఫైల్ ఫోటో)
హైదరాబాద్ నడిబొడ్డున నిలబడి పక్క రాష్ట్రం ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామని సోనియాగాంధీ చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆరోపించారు. ప్రజాకూటమి ఆలోచన, వారి ప్రస్థానం ఎటు వైపు సాగుతుందనే అంశం నిన్నటి కాంగ్రెస్ సభతో స్పష్టమైందని కవిత అన్నారు.
మేడ్చల్ సభలో సోనియాగాంధీ నోటి వెంట చంద్రబాబు మాటలు వినిపించాయని టీఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిలబడి పక్క రాష్ట్రం ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామని సోనియాగాంధీ చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని ఆక్షేపించారు. ప్రజాకూటమి ఆలోచన, వారి ప్రస్థానం ఎటు వైపు సాగుతుందనే అంశం నిన్నటి కాంగ్రెస్ సభతో స్పష్టమైందని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ హక్కుల గురించి మాట్లాడని వారికి ఓటు ఎందుకు వేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు.
విభజన హామీలపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో 40 సార్లు ఆందోళన చేశారని...అప్పుడు సోనియాగాంధీ ముందు వరుసలో కూర్చున్నారని వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు విషయాలను తెలంగాణ ప్రజలకు చెబితే ఏం అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్ చిన్నచూపు చూస్తోందని కవిత ఆరోపించారు. జీవన్ రెడ్డి, రమణ తెలంగాణ హక్కుల గురించి ప్రయోజనాల గురించి ఏనాడూ పట్టించుకోలేదని కవిత ధ్వజమెత్తారు. వీరిద్దరూ ఆంధ్రా నాయకులతో ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్’కు తెలంగాణ హక్కులు, అవసరాలే ముఖ్యమని... తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే అని కవిత స్పష్టం చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.