Home /News /politics /

MP KAVITA LASHES ON CONGRESS AND CHANDRABABU

వీళ్లు బుడ్డ కాంగ్రెస్ నేతలు...చంద్రబాబుతో పొత్తా ?: ఎంపీ కవిత

ఎంపీ కవిత (ఫైల్ ఫోటో)

ఎంపీ కవిత (ఫైల్ ఫోటో)

రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఆపిణ చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుందని టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రశ్నించారు. కుట్రలు చేసే చంద్రబాబును ప్రజలు నమ్మొద్దని ఆమె పిలుపునిచ్చారు.

    కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై నిజామాబాద్ ఎంపీ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగిత్యాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కవిత... రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఆపిణ చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుందని ప్రశ్నించారు. ఇక్కడున్న కాంగ్రెస్ నేతలను బుడ్డ కాంగ్రెస్ నేతలుగా అభివర్ణించిన కవిత... వీరంతా తమకు ఓ లెక్క కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఢిల్లీలోని వీళ్ల తాతలతోనే కొట్లాడామని తెలిపారు.

    తెలంగాణ అభివృద్ధికి అడ్డంపడితే తొక్కుకుంటూ ముందుకు వెళతామని కవిత అన్నారు. ప్రజలను బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. తాము ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లమని... ఎంతకైనా తెగిస్తామని కామెంట్ చేశారు. కుట్రలు చేసే చంద్రబాబును ప్రజలు నమ్మొద్దని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని వర్గాలు కేసీఆర్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నాయని కవిత అన్నారు. ఈ సారి జగిత్యాలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమిని ప్రజలు నమ్మడం లేదని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Mahakutami, MP Kavitha, Tdp, Telangana, Telangana Election 2018, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు