MP By election Result 2020: మధ్యప్రదేశ్‌లో బీజేపీ సర్కార్ సేఫ్.. ముందుగానే దీపావళి సంబరాలు..

మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ అధిక్యం కనబరుస్తుండంతో.. శివరాజ్ సింగ్ సర్కార్ సేఫ్ జోన్‌లోకి వెళ్లింది. 

news18-telugu
Updated: November 10, 2020, 3:02 PM IST
MP By election Result 2020: మధ్యప్రదేశ్‌లో బీజేపీ సర్కార్ సేఫ్.. ముందుగానే దీపావళి సంబరాలు..
ఉప ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
  • Share this:
మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ అధిక్యం కనబరుస్తుండంతో.. శివరాజ్ సింగ్ సర్కార్ సేఫ్ జోన్‌లోకి వెళ్లింది.  మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. ప్రస్తుతం బీజేపీ 20 స్థానాల్లో, కాంగ్రెస్ 7, బీఎస్పీ ఒక్క స్థానంలో అధిక్యంలో ఉన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మరోసారి అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పట్టం కట్టారని తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని నిర్ణయించారని.. ఈ విషయం ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో కలిసి ఫలితాలను వీక్షిస్తున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు. ఆ ఫొటోల్లో శివరాజ్ సింగ్ నవ్వుతూ కనిపించారు. అలాగే బీజేపీ సీనియర్ నేతలు శివరాజ్ సింగ్ చౌహాన్‌కు స్వీట్లు తినిపించారు. ఇక, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం సేఫ్ జోన్‌లోకి రావడంతో.. ఆ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముందుగానే దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు.

ఈ ఏడాది ఆరంభంలో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీ గూటికి చేరారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ గూటికి చేరిన 25 మంది ఎమ్మెల్యేలు.. తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థులుగా ఉప ఎన్నికలకు సిద్దమయ్యారు. ఈ 25 స్థానాలతో పాటు ముగ్గరు ఎమ్మెల్యేలు మృతి చెందడంతో ఆ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించారు. దీంతో మొత్తంగా 28 స్థానాలకు మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి.

ఇక, 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో.. ఉపఎన్నికలకు ముందు బీజేపీకి 107, కాంగ్రెస్ 87 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఉప ఎన్నికల్లో 8 సీట్లలో గెలుపొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా వెలువడుతున్న ఫలితాలను బట్టి బీజేపీ సర్కార్‌కు వచ్చిన ముప్పు ఏమి లేదని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు 20 స్థానాల్లో అధిక్యంలో ఉండటంతో శివరాజ్‌సింగ్ సర్కార్‌కు భారీ మెజారిటీ లభించే అవకాశం కన్పిస్తుంది.



కాంగ్రెస్ ఆశలు సమాధి..
తాజాగా వెలువడుతున్న మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ఆశలను సమాధి చేశాయి. ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించి రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం 8 స్థానాల్లో మాత్రమే అధిక్యంగా ఉంది. ఇక, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమిని మాజీ సీఎం కమల్‌నాథ్ అంగీకరించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టాలంటే కనీసం 22 స్థానాలైనా సాధించాల్సి ఉండింది.
Published by: Sumanth Kanukula
First published: November 10, 2020, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading