news18-telugu
Updated: December 18, 2019, 4:14 PM IST
ఈ కార్యక్రమానికి పలువురు అధికారులతో పాటు... ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా కూడా హాజరయ్యారు.
కడప స్టీల్ ప్లాంట్‌కు ఐరన్‌ఓర్ సరఫరాపై ఎన్ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు.
అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన వారిలో ఎన్ఎండీసీ డైరెక్టర్ (కమర్షియల్) అలోక్‌కుమార్ మెహతా, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ సీఎండీ పి.మధుసూదన్ ఉన్నారు. ఎన్ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకం అన్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులతో పాటు... ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా కూడా హాజరయ్యారు.

మరోవైపు కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో 3వేల ఎకరాలను స్టీల్ ప్లాంట్‌కు కేటాయిస్తూ కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ప్రతిపాదనలు పంపారు. సున్నపురాళ్ల పల్లె, పెద్దవండ్లూరు పరిధిలో సుమారు 3148.68 ఎకరాల భూమి కేటాయించాలని కలెక్టర్ హరికిరణ్ ప్రతిపాదించారు. ఎకరం భూమి మార్కెట్ ధర ప్రకారం రూ.1.25లక్షలకు కేటాయించాలని ఆ ప్రతిపాదనల్లో కోరారు. ఈనెల 23 లేదా 24 తేదీల్లో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేయాలని జగన్ ప్రభుత్వం సంకల్పించింది. జగన్ ప్రభుత్వం ఇటీవలే కడప స్టీల్ ప్లాంట్ పేరును ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌గా మార్చింది.
Published by:
Sulthana Begum Shaik
First published:
December 18, 2019, 4:06 PM IST