• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MOTIVATIONAL SPEAKER BROTHER SHAFI MEETS YS SHARMILA SAYS WILL LISTEN GOOD NEWS BA

YS Sharmila: వైఎస్ షర్మిల పార్టీ ప్లాన్ గురించి చెప్పిన బ్రదర్ షఫీ.. ఆయన చేరడంపైనా క్లారిటీ

YS Sharmila: వైఎస్ షర్మిల పార్టీ ప్లాన్ గురించి చెప్పిన బ్రదర్ షఫీ.. ఆయన చేరడంపైనా క్లారిటీ

వైఎస్ షర్మిలను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న బ్రదర్ షఫీ

బ్రదర్ షఫీ అనే పేరు యూట్యూబ్‌లో బాగా ఫేమస్. ఆయన మోటివేషనల్ స్పీకర్. ‘BR SHAFI నేను సైతం సమాజం కోసం’ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. ఆయనకు 1.71 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.

  • Share this:
    ప్రముఖ మోటివేషనల్ స్పీకర్‌గా పేరుపొందిన బ్రదర్ షఫీ.. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిలతో సమావేశం అయ్యారు. ఆమె పెట్టబోయే పార్టీ గురించి, ఇతరత్రా అంశాలపై వైఎస్ షర్మిలతో పాటు మరికొందరు నేతలతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో యువత, రైతులు, అన్ని వర్గాల వారు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టే అంశం మీద వైఎస్ షర్మిల ప్లాన్ చెప్పారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని వైఎస్ షర్మిల ప్లాన్ చేశారు. దీనిపై మాట్లాడడానికి షర్మిల ఆహ్వానించారు. ముందు నుంచి మార్పుకోసం గొంతెత్తుతున్నా. ఇప్పుడు కలసి ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులకు వారి హక్కులు అందుతున్నాయా అనేది ప్రశ్న. ఇలాంటి సమయంలో వారికి సరైన ప్రభుత్వం కావాలి. దానికి సమాధానంగా గొప్ప నాయకత్వంతో వైఎస్ షర్మిల ముందుకొస్తున్నారు. ఆమెతో మాట్లాడినప్పుడు నాయకత్వ లక్షణాలు కనిపించాయి. ఆమె మాటల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కనిపించారు. ఇదే ఆలోచనతో ముందుకు వెళితే మంచి మార్పు వస్తుంది. త్వరలోనే శుభవార్త వినబోతున్నారు.’ అని బ్రదర్ షఫీ అన్నారు.

    మన ప్రాంతం కోసం, మన ప్రజల కోసం, మన యువత కోసం, మహిళలు మన కోసం నిలబడాలన్నారు. మనకోసం పనిచేసే తరుణం వచ్చిందన్నారు.. ఇదో అద్భుత అవకాశం. మన తరం, మన భవిష్యత్తు తరాలను మార్చుకోవడానికి బ్రదర్ షఫీగా తాను పిలుపునిస్తున్నాననని ఆయన తెలిపారు. పార్టీలో చేరుతున్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఏ విధంగా బాధ్యతలు తీసుకుని ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నామన్నారు. దీనిపై త్వరలోనే మరిన్ని విషయాలు చెబుతామన్నారు.

    ఎవరీ బ్రదర్ షఫీ
    బ్రదర్ షఫీ అనే పేరు యూట్యూబ్‌లో బాగా ఫేమస్. ఆయన మోటివేషనల్ స్పీకర్. ‘BR SHAFI నేను సైతం సమాజం కోసం’ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. ఆయనకు 1.71 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఓటమి, విజయాలు, పరాజయాలు.. ఇలా భిన్నమైన అంశాలపై ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంటారు. ఆయన ప్రసంగాలు యూట్యూబ్‌లో చాలా పాపులర్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు