ఒకే దేశం.. ఒకే భాషపై అమిత్ షాకు మమతా బెనర్జీ కౌంటర్..

Hindi Diwas : హిందీ దివస్‌ను పురస్కరించుకుని హిందీ మాట్లాడే ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన మమతా.. అదే సమయంలో మాతృభాష గొప్పదనం గురించి కూడా చెప్పారు.

news18-telugu
Updated: September 14, 2019, 1:45 PM IST
ఒకే దేశం.. ఒకే భాషపై అమిత్ షాకు మమతా బెనర్జీ కౌంటర్..
మమతా బెనర్జీ (File)
  • Share this:
ఒకే దేశం.. ఒకే భాష అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు.మాతృభాష అన్నింటికంటే గొప్పదని చెప్పారు. దేశ ప్రజలు హిందీ ఎక్కువగా మాట్లాడాలని.. దేశాన్ని ఒక్క తాటి పైకి తీసుకొచ్చే భాష హిందీయే అని అమిత్ షా ట్వీట్ చేసిన కాసేపటికే మమతా ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. హిందీ దివస్‌ను పురస్కరించుకుని హిందీ మాట్లాడే ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన మమతా.. అదే సమయంలో మాతృభాష గొప్పదనం గురించి కూడా చెప్పారు.

హిందీ దివస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అన్ని భాషలను, సంస్కృతులను మనం సమానంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎదుగుతున్న క్రమంలో మనం చాలా భాషలు నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషను మాత్రం మరువకూడదు.
మమతా బెనర్జీ,బెంగాల్ సీఎం


తాజాగా బెంగాల్‌లోని కంచరపరాలో ఓ సభలో పాల్గొన్న సందర్భంగా మమతా మాట్లాడారు.బెంగాల్ ప్రజలు బంగ్లా భాషను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మనం ఢిల్లీ వెళ్లినప్పుడు హిందీ మాట్లాడుతామని.. పంజాబ్ వెళ్తే పంజాబీ మాట్లాడుతామని..తానూ అదే చేస్తానని చెప్పారు. తమిళనాడు వెళ్తే.. తనకు తమిళ్ రాదు కాబట్టి.. ఏదో తనకొచ్చిన కొద్ది పదాలు తమిళంలో మాట్లాడుతానని చెప్పారు. అదే తరహాలో బెంగాల్‌లో ఉన్నప్పుడు బెంగాల్ మాట్లాడాలన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో 2017లో భాషకు సంబంధించి పెద్ద దుమారం రేగింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో డార్జిలింగ్‌లోని గోర్ఖా,నేపాలీ కమ్యూనిటీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ సమయంలో నిరనసల కారణంగా దాదాపు 986 స్కూళ్లు మూతపడ్డాయి. అయితే నిరసనల హోరుతో ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం.. స్కూళ్లలో బెంగాలీ భాషను తప్పనిసరిగా బోధించాలన్న నిబంధన నుంచి గోర్ఖాలాండ్‌కు మినహాయింపునిచ్చారు.ఇది కూడా చదవండి : ఒకే దేశం.. ఒకే భాష.. గాంధీ కలలను నిజం చేయాలి : అమిత్ షా
First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading