Arun Jaitley: ఆదివారం అరుణ్ జైట్లీ అంత్యక్రియలు

జైట్లీ పార్థివదేహాన్ని కైలాశ్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. ప్రజలు, అభిమానుల దర్శనార్థం ఆయన నివాసం వద్ద భౌతికకాయాన్ని ఉంచనున్నారు.

news18-telugu
Updated: August 24, 2019, 3:56 PM IST
Arun Jaitley: ఆదివారం అరుణ్ జైట్లీ అంత్యక్రియలు
అరుణ్ జైట్లీ
news18-telugu
Updated: August 24, 2019, 3:56 PM IST
కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీంతో ఆసుపత్రి వద్దకు బిజెపి అగ్రనేతలంతా చేరుకున్నారు. కాసేపటి క్రితమే జైట్లీ పార్థివదేహాన్ని కైలాశ్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. ప్రజలు, అభిమానుల దర్శనార్థం ఆయన నివాసం వద్ద భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఆదివారం ఉదయం బిజెపి ప్రధాన కార్యాలయానికి జైట్లీ పార్థివదేహాన్నితీసుకెళ్తారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళి అర్పించనున్నాయి. అనంతరం అక్కడి నుంచి నిగమ్‌ బోధ్‌ ఘాట్‌ కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. జైట్లీ మరణంతో బీహార్‌ లోని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ, అరుణ్ జైట్లీ దక్కలేదు. అరుణ్ జైట్లీ మరణాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు

First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...