Shock to Government: ఏపీ ప్రభుత్వానికి షాక్.. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా..! కారణం ఏంటో తెలుసా?

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామ

Andhra Praddesh: మూకుమ్మడిగా వాలంటీర్లంతా రాజీనామకు సిద్ధమవ్వడం కలకలం రేపుతోంది. ఒకేసారి అంతమంది వాలంటీర్లు రాజీనామా చేస్తామంటున్నారంటే ఏం జరిగింది అనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో ఆ ఇష్యూపై ఉన్నతాధికారులు ఫోకస్ చేశారు..

 • Share this:
  Volunteers Resgnation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh)ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి వాలంటీర్ల (Voluneteers)వ్యవస్థ ప్రారంభించింది. కానీ వాలంటీర్ల వ్యవహారం ప్రతిసారి ప్రభుత్వానికి తలనొప్పిగానే మారుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వాలంటీర్ల తీరు పెను దుమారం రేపుతోంది. విపక్షాలైతే తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో వాలంటీర్లను ప్రభుత్వం వాడుకుంటోందని.. ఓట్లు పడేలా వాలంటీర్లు సహకారం అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు పలు నేరాల్లో కూడా వాలంటీర్లు భాగస్వాములవుతున్నారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయినా మాత్రం ప్రభుత్వం వాలంటీర్లు అద్భుతంగా పని చేస్తున్నారంటూ కితాబు ఇస్తూనే ఉంది. ఇటీవల తమ జీతాలపై వాలంటీర్లంతా మూకుమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) స్వయంగా ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది. వాలంటీరు అన్నది సేవాభావంతో చేయాలని.. లేఖలు రాశారు.. ఈ సందర్భంగా వాలంటీర్లకు బహుమతులను కూడా ప్రకటించింది. ఘనంగా సత్కారాలు కూడా చేశారు. దీంతో ఇక్కడితో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మరోసారి కొందరు వాలంటీర్లు షాక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు..

  చిత్తూరు జిల్లా (Chitoor District)లో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా తీవ్ర చర్చనీయాంశమైంది. అంతమంది వాలంటీర్లు ఆందోళనకు దిగడంతో జిల్లా ఉన్నతాధికారులు ఏం జరిగింది అంటూ ఆ ఇష్యూపై ఫోకస్ పెట్టారు. అయినా మాత్రం ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం వాలింటీర్లు మెట్టుదిగమంటున్నారు. రాజీనామ చేయడానికి సిద్దమయ్యామని.. ఎవరు చెప్పినా వెనక్కు తగ్గేది లేదంటున్నారు..

  చిత్తూరు జిల్లాలో దాదాపు 70 మందికిపైగా వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా కలకలం రేపుతోంది. సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎంపీడీవో కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి ఈవోగా ఉన్న అధికారిపై చర్యలు తీసుకునేంత వరకు తాము విధులకు హాజరు కాబోమన్నారు.  చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తున్నారని పాకాల మండలంలోని వాలంటీర్లు ఎంపీడీవో కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్లను వేధిస్తున్న ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికార నేతలు వేధింపులు మానుకోవాలన్నారు. గ్రామ పంచాయతీకి ఈవోగా కుసుమకుమారి ఉన్నంత వరకు తాము విధులకు హాజరు కాబోమన్నారు. మొత్తం 76 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నామని తెలిపారు.

  ఇదీ చదవండిఇకపై విద్యాదీవెన తల్లుల అకౌంట్ లో పడదు.. హైకోర్టు తీర్పుతో ఏపీలో విద్యా సంస్థలకు ఊరట

  ఈవో తమను అసభ్య పదజాలంతో దూషించారని, తమను మానసికంగా చాలా తీవ్ర ఇబ్బందులకు, మనోవేదనకు గురి చేశారన్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాలంటీర్లపై స్థానిక రాజకీయ నేతలు పెత్తనాలు మానుకోవాలని.. అలాగే వారిని కట్టడి చేయాలని డిమాండ్ చేయాలంటూ తహసీల్దార్‌కు ఫిర్యాదు పత్రం అందజేశారు. ప్రస్తుతం వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
  Published by:Nagesh Paina
  First published: