తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ... ఒక్క పదవి కోసం 10 మంది పోటీ

ఈసారి తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవి కోసం గతంలో ఎన్నడూ లేనంతగా పోటీ నెలకొంది.

news18-telugu
Updated: February 25, 2020, 11:49 AM IST
తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ... ఒక్క పదవి కోసం 10 మంది పోటీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో బీజేపీ నాయకత్వ మార్పు అంశం దాదాపుగా క్లైమాక్స్‌కు చేరుకుంది. కొత్త అధ్యక్షుడిని ఖరారు చేయడానికి ముందు రాష్ట్ర నేతల అభిప్రాయం తీసుకోవాలని భావించిన జాతీయ నాయకత్వం... ఇందుకోసం పార్టీ నేతలు అనిల్ జైన్, బైజయంత్ పండాను రాష్ట్రానికి పంపించింది. రాష్ట్ర నేతలతో సమావేశమైన ఈ ఇద్దరు... ఎక్కువగా కొత్త అధ్యక్షుడి ఎన్నికపై నేతల సలహాలను తీసుకునేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి బీజేపీలో అధ్యక్ష పదవి కోసం గతంలో ఎన్నడూ లేనంతగా పోటీ నెలకొంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు ఎంపీలు అరవింద్, సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు కృష్ణసాగర్ రావు, పి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు.

వీరంతా అధ్యక్ష పదవి కోసం తమ పేర్లను పరిశీలించాలని బీజేపీ జాతీయ నాయకత్వం పంపించిన పరిశీలకులను కోరినట్టు తెలుస్తోంది. అయితే చాలామంది నేతలు రాష్ట్ర నాయకత్వ మార్పు కచ్చితంగా అవసరమని వారికి సూచించినట్టు తెలుస్తోంది. కొందరు నేతలు ఈసారి అధ్యక్ష పదవి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వారికి కాకుండా ఇతర జిల్లాల వారికి ఇవ్వాలని కోరగా... జీహెచ్ఎంసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని నగరానికి చెందిన నేతనే ఇందుకోసం ఎంపిక చేస్తే బాగుంటుందని మరికొందరు నేతలు జాతీయ నేతలకు సూచించినట్టు సమాచారం. మొత్తానికి బీజేపీ కొత్త చీఫ్‌గా ఆ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందనే అంశం ఉత్కంఠగా మారింది.


First published: February 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు